తెలుగు చిత్ర పరిశ్రమలో రైన్ డాన్స్  కి ఎంతగానో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే దర్శక నిర్మాతలు కూడా కుదిరితే తమ సినిమాలలో రెయిన్ డాన్స్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఏదైనా సినిమాలో రైన్ డాన్స్ ఉంది అంటే అటు ప్రేక్షకులు కూడా ఉర్రూతలూగి పోతూ ఉంటారు. ఇలా రైన్  డాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్శిస్తూ ఉంటుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి ఇలా రెయిన్ డ్యాన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రైన్ డాన్స్ ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది ఫిదా చేస్తోంది కూడా. అయితే ఇప్పటికే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలందరూ చాలా సినిమాల్లోనే రెయిన్ డాన్స్ తో  ప్రేక్షకులను అలరించారు. 

 


 ఇలా ప్రేక్షకులను ఎక్కువగా అలరించిన వారిలో బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బంగారు బుల్లోడు సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బంగారు బుల్లోడు సినిమాలో బాలకృష్ణ చేసిన రైన్ డాన్స్ స్వాతిలో ముత్యమంత అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎదురుగా నిలిచింది. ఈ పాట వినడానికి ఇప్పటికీ ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. కేవలం పాట నే కాదు ఇక వీడియో ద్వారా చూస్తే హీరోయిన్ డాన్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లో బాలకృష్ణ బంగారు బుల్లోడు సినిమా లో చేసిన స్వాతిలో ముత్యమంతా అనే  డాన్స్ ట్రెండింగ్  గా మారిపోయింది అని చెప్పాను. 

 


 ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించిన ఈ రైన్  డాన్స్.... ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. నాటితరం జనరేషన్ లో వచ్చిన స్వాతిలో ముత్యమంత పాట ఇప్పటికీ కూడా ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటుంది. ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉండడంతో పాటు విజువల్గా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పాలి . ఇక ఈ పాట ఇప్పటికీ కూడా టీవీలో వచ్చిందంటే చాలు ప్రేక్షకులు మైమరచిపోయి మరి చూస్తూ ఉంటారు. ఇక బాలకృష్ణ నటించిన సినిమాలో ఈ పాట ఎవర్గ్రీన్ గా నిలిచింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: