తెలుగు చిత్ర పరిశ్రమలో రైన్  సాంగ్స్ కి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ఈ రేయిన్  సాంగ్స్ ట్రెండ్  ఇప్పటిది కాదు నాడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాలంలోనే రైన్  సాంగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించారు నాటి తరం హీరోలు. నాటి తరం లో వచ్చిన ఎన్నో రైన్ సాంగ్స్ ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉన్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల్లో రెయిన్ సాంగ్ అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేటితరం దర్శకుల్లో కూడా కొంతమంది తమ సినిమాలలో రెయిన్ సాంగ్స్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో రైన్ సాంగ్స్ అంతగా ఎక్కువగా కనిపించక పోయినప్పటికీ ఒకప్పుడు మాత్రం రెయిన్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి అని చెప్పాలి.

 


 ఇక నాటి తరం హీరోలు అయినా అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారకరామారావు కాలంలో ఎన్నో రైన్  సాంగ్స్ వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఇలా వచ్చిన ఒక పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే... చెప్పలేని ఆ హాయి ఎంతో గొప్పగా ఉంటుందోయి.   అంటూ సాగిపోయే రైన్ సాంగ్ ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో  ఫేవరేట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఆణిముత్యాల్లాంటి పాటలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయాయి అని చెప్పాలి. ఇక ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు.. సరోజాదేవి తమదైన నటనతో హావభావాలతో ఎంతగానో ఆకట్టుకుంటారు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. 

 

 

 ఈ సినిమాకు ఘంటసాల మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. అప్పట్లో  స్టార్ హీరోలందరికీ ఘంటసాల మ్యూజిక్ డైరెక్టర్ గా కేరాఫ్ అడ్రస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఘంటసాల పాటలు అంటే తెలుగు ప్రేక్షకులందరూ చెవి కోసుకునే వారు అంటూ ఉంటారు. కాగా గంటసాల అందించిన పాటల  లో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే అద్భుతమైన పాట కూడా ఒకటి. ఈ పాట  ద్వారా గంటసాల మరింత గుర్తింపు తెచ్చుకున్నారు అని చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు సరోజాదేవి లు పాటలో  తమదైన హావభావాలతో పాటకు అర్థాన్ని వచ్చే విధంగా నృత్యం హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారు. అందుకే ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరేట్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: