దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది క్రైమ్ రేటు కూడా పెరిగిపోతుంది.  సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా బుక్ చేస్తున్నారు.  సెల్ ఫోన్లకు మీకు డబ్బ వచ్చింది.. అకౌంట్ నెంబర్ డిటేల్స్ ఇవ్వమని ఫోన్ చేయడం.. మేసెజ్ చేయడం చేస్తున్నారు. అమాయంగా వారికి అన్ని వివరాలు చెప్పిన వారి డబ్బు క్షణాల్లో మాయం చేస్తున్నారు. ఇక హ్యాకర్ల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాాజాగా పూరీ కావాలని ఆర్డర్ ఇచ్చి హోటల్ వ్యాపారి నుంచి ఏకంగా రూ. 25 వేలు టోకరా పెట్టాడు ఓ కేటుగాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇది చోటు చేసుకుంది. చాకచక్యంగా నమ్మించి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పి మోసగించాడు. చందన హోటల్‌ యజమానికి ఓ మోసగాడు ఫోన్ తాను ఆర్మీ జవానుగా పరిచయం చేసుకున్నాడు. తనకు 50 ప్లేట్ల పూరీ కావాలని హుజురాబాద్ నుంచి వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. 

 

మీ వివరాలు చెప్పండి.. డబ్బు ఆన్ లైన్ లో  పంపుతానని చెప్పాడు.  ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తానని ఏటీఎం కార్డు నంబర్ చెప్పాలని కోరాడు. అయితే తనకు ఏటీఎం కార్డు లేకపోడంతో మరో వ్యక్తి కార్డు తీసుకొని దాని నంబర్ చెప్పాడు. ఆ తర్వాత అతని ఫోన్‌కు వచ్చిన పిన్ నంబర్ చెప్పమనగానే దాన్ని చెప్పేశాడు.  అంతే క్షణాల్లో అతని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయం అయ్యాయి.. తీరా విషయం తెలుసుకొని లబో దిబో అన్నారు.  ఆ తర్వాత అతడి ఆచూకీ లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఎవరైనా పిన్ నంబర్లు, ఓటీపీ చెప్పమంటే అమాయకంగా ప్రజలు నమ్మకూడదని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: