దీపికా పడుకొనే, రణ్‌వీర్‌ సింగ్ దంపతులను హిందీ ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. బాలీవుడ్ ఉత్తమ దంపతులలో డీప్ వీర్ జంట ఖచ్చితంగా మొదటి స్థానాన్ని సంపాదించుకుంటారని, ఏ స్టార్ జంట అయినా వాళ్ల తరువాతనే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. బహిర్ముఖుడైన రణ్‌వీర్‌ సింగ్ తన భార్య అంటే తనకు ప్రాణం అని అనేక సందర్భాల్లో చెప్పకనే చెప్పేశాడు. పర్ఫెక్ట్ హస్బెండ్(భర్త) గా ఉంటూ తన భార్య దీపికాకు ఎంతో గౌరవం ఇచ్చే రణ్‌వీర్‌ సింగ్ లాంటి అబ్బాయి తనకు భర్తగా రావాలని ఎంతోమంది ఫిమేల్ అభిమానులు కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. 


నిజమైన ప్రేమ కి ఉదాహరణ గా నిలుస్తున్న ఈ జంట రొమాన్స్ చేస్తే చూడడానికి లక్షల మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. అలాంటి అభిమానుల కోసం దీపిక, రణ్‌వీర్‌ సింగ్ కలసి తమ ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చిత్ర షూటింగులు నిలిపివేయడంతో ఇంటికే పరిమితమైన దీపికా పడుకొణే రణ్ వీర్ సింగ్ సరదాగా తమ సమయాన్ని గడుపుతున్నారు. ఇటీవల కాలంలో రణ్‌వీర్‌ సింగ్ ఇంస్టాగ్రామ్ లో బాగా చురుకుగా ఉంటూ తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అయితే తాజాగా రణ్‌వీర్‌ సింగ్ పాల్గొన్న ఓ ఇంస్టాగ్రామ్ లైవ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 


తాజాగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇంస్టాగ్రామ్ లైవ్ లో రణ్‌వీర్‌ సింగ్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వగానే రణ్‌వీర్‌ సింగ్ తన లాంగ్ హెయిర్ చేతితో సరిచేసుకుంటూ నవ్వుతూ పెద్దగా ఆయుష్మాన్ ఖురానా తో మాట్లాడటం ప్రారంభించాడు. ఐతే కొన్ని సెకన్లలోనే తను భయపడి పోయి కెమెరా నుండి అవతల వైపు చూశాడు. వెనువెంటనే... 'ఓకే, బాయ్ బాయ్!!', అని చెప్పాడు. దాంతో ఆయుష్మాన్ ఖురానా ఆశ్చర్యపోయి ఏంటి బాయ్ బాయ్ చెప్తున్నారు? అని ప్రశ్నించగా... 'మీ అక్క(దీపికా పడుకొణే) నన్ను తిడుతుంది. తాను జూమ్ చాట్ లో ఉన్నానని, గట్టిగా మాట్లాడొద్దని అంటుంది', అని అన్నాడు. ఆయుష్మాన్ ఖురానా కూడా అతన్ని అర్థం చేసుకొని... ' ఐ లవ్ యు అండ్ ఐ మిస్ యు', అని చెప్పగా... రణ్‌వీర్‌ సింగ్ కూడా ఐ లవ్ యు ఆయుష్ అని లైవ్ వీడియో చాట్ నుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: