ఇండస్ట్రీలో హీరోలదే డామినేషన్. సినిమాల్లో హీరోకే స్కోప్ ఎక్కువ. రెమ్యునరేషన్ లోనూ హీరోయిన్లను డామినేట్ చేస్తుంటారు హీరోలు. కానీ బాలీవుడ్ లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కొంతమంది హీరోయిన్లు ఖాన్ త్రయాన్ని కూడా దాటేస్తున్నారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో చరిత్ర సృష్టిస్తున్నారు. 

 

అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలు బరిలో దిగుతున్నారంటే అక్షయ్ కుమార్ లాటి హీరోలు కూడా ఆలోచిస్తుంటారు. పోటీవద్దని సైడ్ కి వెళ్లిపోతుంటారు. అలాంటి ఖాన్స్ ను బీట్ చేశారు బాలీవుడ్ బ్యూటీస్. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సంపాదించుకొని ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే లాంటి హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ లో టాప్ లేపుతున్నారు. 

 

ఈ మధ్య కలెక్షన్లతో పాటు ఇన్ స్టా గ్రామ్ ఫాలోయింగ్ లోనూ స్టార్ల రేంజ్ ని కాలిక్యులేట్ చేస్తున్నారు. ఎన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే అంత పెద్ద స్టార్ గా చూస్తున్నారు. బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కు ఈ ఫాలోవర్ల సంఖ్యతో చెక్ వాల్యూ మారుతోంది. అయితే మార్కెట్ మీటర్ గా మారిన ఈ ఇన్ స్టా గ్రామ్ లో హీరోలను డామినేట్ చేస్తున్నారు హీరోయిన్లు. ప్రియాంకా చోప్రా అయితే 53.5మిలియన్ల ఫాలోవర్స్ తో టాప్ లో ఉంది. 

 

బాలీవుడ్ టాప్ చైర్ కోసం ప్రియాంకా చోప్రాతో పోటీ పడిన దీపిక పదుకొనే.. ఇన్ స్టా గ్రామ్ ఫాలోయింగ్ లోనూ ఈమెతో పోటీ పడింది. 48.8 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది ప్రియాంక. ఇక 48.3 మిలియన్ ఫాలో వర్స్ తో తర్వాతి స్థానంలో నిలిచింది ఆలియా భట్. ఈమె తర్వాత 46.6 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ 4వ స్థానంలో ఉంది. 

 

హీరోయిన్లు అంతా 50 మిలియన్ల ఫాలోవర్స్ కు దగ్గరగా ఉంటే.. హీరోలు మాత్రం వీళ్లని రీచ్ కాలేకపోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర సింహాల్లా గర్జించే హీరోలు ఇన్ స్టాలో మాత్రం చాలా సైలెంట్ అయిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: