తెలుగులో సినిమాలకు ఉండే మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ భాషలో కూడా జరగని విధంగా మన తెలుగులో మార్కెట్ జరుగుతూ ఉంటుంది. వేలాది కోట్ల రూపాయల మార్కెట్ అనేది ప్రతీ ఏటా జరుగుతూ ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలుగు లో సినిమాలకు పెట్టుబడులు పెట్టడానికి గానూ రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా వరకు అగ్ర నిర్మాతలు హీరోల సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

చిన్న చిన్న సినిమాలను కాకుండా పెద్ద పెద్ద సినిమాలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఒప్పంధాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు మార్కెట్ ని ఫోకస్ చేస్తున్నారు. బడా నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల ద్వారా లాభాలను పొందాలి అని భావిస్తున్నారు. వాళ్ళు అయితే వడ్డీలు కూడా తక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని భావించి సినిమాలను నిర్మించాలి అని భావిస్తున్నారు.

 

టాలీవుడ్ లో త్వరలో మొదలయ్యే ఒక స్టార్ హీరో సినిమాకు సంబంధించి కూడా ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత కూడా వస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తున్న ఒక నిర్మాత తనకు ఉన్న పరిచయాలతో రాజకీయ నాయకుల నుంచి భారీగా తెచ్చి పెట్టుబడులు పెట్టాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఎన్టీఆర్ సినిమాలో కూడా పెట్టుబడులు పెట్టాలి అని ఒక నిర్మాత ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: