సాధారణంగా టాలీవుడ్ లో కొందరు నిర్మాతల సినిమాలకు కూడా హీరోలకు ఉండే క్రేజ్ ఉంటుంది. అందులో ప్రధానంగా చెప్పుకునే వారు సురేష్ బాబు అల్లు అరవింద్, దిల్ రాజు... వీరి సినిమాలు వస్తున్నాయి అనగానే జనాలకు ఒకరకమైన క్రేజ్ అనేది ఉంటుంది. ఆ సినిమాల్లో హీరోలు ఎవరు హీరోయిన్ లు ఎవరు లాంటి అనేక విషయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉంటారు. అయితే వీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న చిన్న సినిమాల మీద ఫోకస్ చేసారు. అల్లు అరవింద్ ఇప్పటికే చిన్న చిన్న సినిమాలను కొన్న సంగతి తెలిసిందే. 

 

ఇక దిల్ రాజు కూడా ఇతర భాషల మీద ఫోకస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇతర భాషల్లో మంచి హిట్ అయిన సినిమాలను ఎక్కువగా కొనుగోలు చెయ్యాలి అని ఆయన భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన జానూ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయన వెనక్కు తగ్గవద్దు అని భావిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ళ పాట అగ్ర హీరోల సినిమాలకు వెళ్ళవద్దు అని భావిస్తున్నారట. చిన్న చిన్న సినిమాల విషయంలో వీరి మధ్య కొన్ని కొన్ని విభేదాలు వచ్చాయి. 

 

వాటిని చాలా వరకు పరిష్కరించుకుని ముందుకి వెళ్ళాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలను ఎలాగూ మైత్రీ మూవీ మేకర్స్ లేదా దానయ్య లేదా సాయి కొర్రపాటి వంటి వారు చేస్తున్నారు కాబట్టి అగ్ర హీరోల జోలికి వద్దు అని నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల వీరి మధ్య ఎక్కువగా చిన్న సినిమాలకు సంబంధించిన చర్చ జరిగింది అని సమాచారం. అందులో ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి ఏ సినిమాలు కొంటారో...

మరింత సమాచారం తెలుసుకోండి: