టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలను విడుదల చేసే పరిస్థితి దాదాపుగా లేదు కాబట్టి ఓటీటీలో సినిమాలను విడుదల చేయడానికి గానూ టాలీవుడ్ అనేక ప్రయత్నాలను చేస్తుంది. చిన్న సినిమాలు ఇప్పుడు అక్కడ విడుదల అవడానికి సిద్దంగా ఉన్నాయి అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మరి ఏ సినిమాలను విడుదల చేస్తారు అనేది తెలియదు గాని హీరోలు మాత్రం సినిమాలను అందులో విడుదల చేయడానికి అసలు వద్దు అనే ఆలోచనలో ఉన్నారు. హీరోయిన్ లు కూడా అలా అయితే  సినిమాలను విడుదల చేయవద్దు అని కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

తాము చాలా వరకు కష్టపడి సినిమాలను చేస్తామని అందులో సినిమాలను విడుదల చేస్తే తాము  నష్టపోయే అవకాశం ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక యువ హీరో నిర్మాతతో గొడవ పడ్డారు అని తెలుస్తుంది. ఇక అనుష్క కూడా తన సినిమా విషయంలో నిర్మాతతో గొడవ పడ్డారు అని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని తాము ఎక్కువగా ఇబ్బంది పడతామని చెప్పారట. ఇక స్టార్ నిర్మాతలు కూడా అలాంటి ఆలోచనలు వద్దు అని చెప్తున్నట్టు సమాచారం. ఒకసారి ప్రేక్షకుడు ఇంట్లో కూర్చుని సినిమా చూస్తే చికాకు పడతాడు అని భావిస్తున్నారట. 

 

ఇక హాల్ కి వచ్చే అవకాశం ఉండదు అని కాబట్టి అందులో ఏ మాత్రం కూడా విడుదల చేసే ప్రయత్నాలు చేయవద్దు అని చెప్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొందరి మధ్య అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి అని అంటున్నారు. చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న నిర్మాతలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుందని కమర్షియల్ మార్కెట్ నడుస్తున్న సమయంలో ఈ ప్రయత్నాలు ఎంత మాత్య్రం మంచిది కాదు అని చెప్పారట. మరి ఎంత వరకు ఈ తరహా ప్రయత్నాలకు బ్రేక్ పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: