ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఎవరు మాట్లాడినా... 'ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం' అనే ఒక కామన్ డైలాగ్ చెపుతుండటాన్ని అందరూ గమనించే ఉంటారు. అయితే ఈ విషయంలో కొంత మంది ఏకీభవించినా.. మరికొంత మంది మాత్రం అలాంటిది ఏమీ లేదు.. ఎవరి దారి వారిదే అంటున్నారు.  ఇటీవల బాలకృష్ణ వివాదం చెలరేగిన తర్వాత కూడా సినీ ప్రముఖులంతా సేమ్ టు సేమ్ ఇదే డైలాగును వల్లెవేశారు. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అని చెప్పడం ఒక పెద్ద 'బూతు' అని అన్నారు.  ఇండస్ట్రీలో కుళ్లు, కుతంత్రాలు బాగా ఉన్నాయంటూ.. దర్శకుడు రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావనను తీసుకువచ్చారు.

 

సినిమా గనక ఆడకపోతే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది రోడ్ల మీదకు వచ్చి ఆనందంతో బట్టలూడదీసుకుని గెంతులు వేసి, పండగ చేసుకుంటారని వ్యాఖ్యానించారు.  కొన్ని సందర్బాల్లో అందరూ ఏకమై వస్తారు.. కానీ ఇండస్ట్రీలో ఎవరి బిజినెస్ వారిదని… అంతా ఒకే కుటుంబం ఎంత మాత్రం కాదని వర్మ చెప్పారు. ఎదుటివాడి ఎదుగుదలను ఓర్వలేనితనం ఇండస్ట్రీలో చాలా ఎక్కువ స్థాయిలో ఉందని వర్మ తెలిపారు.

 

ఒకవేళ రాజమౌళి తదుపరి మూవీ 'ఆర్ ఆర్ ఆర్' ఫ్లాప్ అయితే... ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది రోడ్లపైకి వచ్చి, గుడ్డలిప్పేసి, డ్యాన్స్ చేస్తూ పండగ చేసుకుంటారని చెప్పారు. ఒక వ్యక్తి సక్సెస్ ను భరించలేకపోవడం అనేది మానవ నైజమని... ఇండస్ట్రీలో కూడా అదే ఉందని అన్నారు. 'అంతా ఒక్కటే' అనేది సొల్లు అని... అది ఎప్పటికీ జరగదని అన్నారు. అలాగే ఓ వ్యాపారవేత్త ఇంకో వ్యాపారవేత్త ఎదుగుదలను తట్టుకోలేడు. కుళ్లు అనేది మానవ సహజం’ అని వర్మ మాట్లాడారు. కాగా, వర్మ ఆడియోపై నెటిజన్లు రక రకాలుగా  స్పందిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: