మీరా చోప్రా ను విడవకుండా వెంటాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.  అయితే ఈ విషయం ఇంతటితో ముగిసేటట్లు కనిపించడం లేదు. స్వయంగా కేటీఆర్ ఆమె ట్వీట్  కు స్పందించి భరోసా ఇచ్చినా కూడా ఆమెకు ట్రోల్స్ తప్పడం లేదు.  సైబర్  క్రైమ్ పోలీసులు  కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. అభిమానులు దాడి ఆగడం లేదు మరియు కొనసాగుతూనే ఉంది కూడా. అసలు విషయం ఏమిటంటే దాదాపు 30 వేల మంది వేధింపుల  ట్వీట్లు వచ్చాయ్, హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,

 

 

కానీ ఉండేది ఢిల్లీలో కదా అక్కడ ఫిర్యాదు చేశాను అంటూ ఈ అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు. మహేష్ బాబు వీరాభిమానిని..అనే ఈ  ఒక్క వ్యాఖ్య కారణంగా ఆమె సోషల్ మీడియాలో  వేధింపులకు గురి అవుతోంది. కొందరు ఆమె తెలుగు ఇండస్ట్రీలో 2005  లో తెలుగు తెరకు పరిచయం అయ్యింది... అప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే ఎవరో ఆమెకు తెలియదా అని ఆమెను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.... కొందరు  ఆమెను బహిరంగంగా మానభంగం చేస్తాం, ఆమెపై పెట్రోలు దాడి చేస్తాం, పోర్న్ స్టార్ వి వంటి రాతలతో ఆమెను ఇబ్బందు లకు గురి చేస్తున్నారు. ఇందులోకి ఆమె తల్లిదండ్రులను కూడా లాగుతున్నారు...

 

 

తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఈ విధమైన స్పందన గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు అంటూ ప్రముఖులు ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదంతా కూడా ఇండస్ట్రీలో కొందరు ఆమెకు సపోర్ట్  చేస్తున్నట్లు అనుకుంటున్నారు.. ఇదిలా ఉండగా ఇంత జరుగుతుంటే... ఓ మహిళను నీ అభిమానులు అని చెప్పుకునే వాళ్లు ఇంతలా వేధిస్తుంటే ..నాపై  దాడి చేస్తుంటే ఎందుకు మాట్లాడవు ? అని జూనియర్ ని మీరా చోప్రా సూటిగా ప్రశ్నిస్తోంది.  అంతేకాకుండా''మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరించే వాళ్లు నా అభిమానులు కారు ''.. అని ఎన్టీఆర్ నుంచి స్టేట్మెంట్ వస్తే బాగుంటుందని ఈ అమ్మడు ఆశిస్తోంది. అయితే ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: