ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చర్చలు ఒకపక్క సినిమారంగ పరంగా మరోపక్క రాజకీయపరంగా సంచలనాలు రేపుతున్నాయి. చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలు తెలంగాణ ప్రభుత్వం తో షూటింగ్ ల పర్మిషన్ కోసం చర్చలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే నందమూరి నట సింహం బాలయ్య బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అందరికీ తెలిసిందే. తాజాగా విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇదే విషయం పై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి మెలసి ఉండాలని పెద్దలు చెప్పే విషయాల్లో వాస్తవం లేదు అన్నట్టుగా వ్యాఖ్యానించారు.

IHG

ఇటీవల రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కళామతల్లి సంరక్షణ లో అందరూ కలిసి ఉండటం అనేది జరిగే పని కాదని అన్నారు. ఇండస్ట్రీలో వేరు వేరు సినిమాలు వేరు వేరు ప్రాజెక్టులు అదేవిధంగా ఒకరంటే మరొకరికి పడదు అని తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. కలిసి పని చేద్దామని మీటింగులు పెట్టాలన్న అదంతా టైం వేస్ట్ కార్యక్రమం అని… కాఫీలు టీలు తాగడం తప్పా అందరూ ఒక నిర్ణయం పైకి రాలేరని తేల్చేశారు. తెలంగాణ ప్రభుత్వం తో చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలు గురించి సెటైర్ వేశారు. 

IHG

అయినా షూటింగుల్లో జాగ్రత్తలా?  లొకేషన్ లో పోలీసులను పెడతారా?   గార్డులను నియోగిస్తారా? అదంతా ఉత్తుత్తే. జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా? అన్నది ఎవరు చూస్తారు? ఎవరి పని వాళ్లు చేసుకుపోతుంటారు! అంటూ ఒక నగ్నసత్యాన్ని బయటపెట్టారు. దీంతో చాలామంది వర్మ కామెంట్లు విని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకెప్పటికీ కలిసేను, ఎవరికివారు ఇష్టానుసారంగా ఇండస్ట్రీపై రకరకాల అభిప్రాయాలు కలిగి ఈ విధంగా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకటవడం కష్టమని ఆర్జీవీ చేసిన కామెంట్లపై జనాలు రియాక్ట్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: