తమిళ స్టార్ హీరో విజయ్ అతని మేనేజర్ జగదీష్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయని వారిద్దరు విడిపోయారని నిన్న మీడియా లో కథనాలు వెలుబడ్డాయి అయితే ఈవార్తలను చూసి  నవ్వుకున్నాను అని విజయ్ అన్నాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని విజయ్ క్లారిటీ ఇచ్చాడు. విజయ్ సినీ వ్యవహారాలను జగదీషే చూసుకుంటాడు. విజయ్ దగ్గరికి వెళ్లి కథ చెప్పాలన్న ముందు జగదీష్ అపాయింట్మెంట్ తప్పనిసరి. అంతలా జగదీష్ , విజయ్ కి నమ్మకంగా ఉంటున్నాడు. ఇక మేనేజర్ మాత్రమే కాదు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ కు జగదీష్ సహా నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నాడు. 
 
ఇక మాస్టర్ విషయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లేందుకు రెడీ అవుతుంది. త్వరలోనే ఈసినిమా ట్రైలర్ విడుదలకానుంది. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ , కాలేజీ ప్రొఫెసర్ గా కనిపించనుండగా మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. మాళవిక మోహనన్  హీరోయిన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. దీపావళికి మాస్టర్ థియేటర్లలోకి రానుంది. 
 
 ఈ సినిమా తరువాత విజయ్ తన 65వ చిత్రాన్ని ఏఆర్ మురగదాస్ తో చేయనున్నాడు. ఈచిత్రం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ తుపాకికి సీక్వెల్ గా తెరకెక్కనుందట. థమన్ సంగీతం అందించనున్నాడు. విజయ్ సినిమాకు థమన్ సంగీతం అందించనుండడం ఇదే మొదటిసారి. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: