తెలుగు సినిమాల్లో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌ కామన్ అయిపోయాయి. లిప్‌ లాక్‌ లు బెడ్‌ రూమ్‌ సీన్స్‌ చాలా సినిమాల్లో కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. స్కిన్‌ షో చేయాలంటే హీరోయిన్లు ఇంట్రస్ట్ చూపించే వారు కాదు. ముఖ్యంగా గ్లామరస్‌ సీన్స్‌ లో కనిపించే హీరోయిన్లు పెద్దగా లేరు. అలాంటి సమయంలో కూడా హద్దులు చేరిపేసి అందాలు ఆరబోసిన భామలు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రాధ.

 

మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ గ్లామర్‌ షోలో టాప్‌ ప్లేస్‌ లో నిలిచింది. రొమాంటిక్‌ సీన్స్‌ తో అప్పట్లోనే కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది. అందుకే ఇప్పటికీ టాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది రాధ. తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ టైం లోనే బికినీ కూడా వేసింది. ఇక ఫస్ట్ నైట్‌ సీన్స్‌ కూడా ఓ రేంజ్‌ లో చేసింది రాధ. అయితే ఇప్పట్లో లా బెడ్ రూమ్‌ సీన్స్‌ చూపించే అవకాశం అప్పుడు లేదు కాబట్టి ఉన్నంతలోనే రొమాన్స్ ఇరగదీసింది. అందుకే ప్రేక్షకుల గుండేల్లో ఇప్పటికీ నిలిచిపోయింది.

 

అయితే రొమాంటిక్‌ సీన్స్‌ లో ఏ రేంజ్‌ లో నటించిందో హుందా గా కనిపించే సన్నివేశాలు కూడా అదే రేంజ్‌ లో చేసింది. స్కిన్‌ షో హాట్ సీన్స్‌ విషయంలో ఎప్పుడు హద్దులు దాటకుండా జాగ్రత్త పడింది రాధ. అందుకు ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. కమర్షియల్ హీరోయిన్‌ గా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న రాధ తరువాత తన వారసురాళ్ల ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కానీ వాళ్లు రాధ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: