త్రిష... చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించిన హీరోయిన్. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఆమె లేని సినిమా తమిళంలో మాత్రం ఉండేది కాదు. ఆమె నటన తో పాటు అందానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం తో తెలుగులో కూడా ఆమెకు మంచి పాత్రలు సినిమాలు వచ్చాయి. ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే తెలుగు జనాలు ఆమెకు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆమె మాత్రం ఎక్కువగా తమిళ సినిమాల మీద ఫోకస్ చేసి చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి కాస్త ఇబ్బంది పడింది అని అంటారు. 

 

ఇప్పుడు ఆమె అక్కడ ఎక్కువగా సినిమాలు చేస్తుంది. ఆ సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలతో చేస్తున్న సినిమాలే కావడం విశేషం. ఇప్పుడు ఆమె లాక్ డౌన్ లో ఖాళీ గా ఉండగా తెలుగులో సినిమాలు చెయ్యాలి అని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు  వార్తలు వస్తున్నాయి గాని అది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇదిలా ఉంటే ఆమె ఏ సినిమా చేసినా సరే గ్లామర్ కి మాత్రం చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చింది అని అంటారు జనాలు. ఏ సినిమాలో అయినా సరే ఆమె గ్లామర్ ని చూపించే విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గే పరిస్థితి ఉండదు అని అంటారు. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా ఎవరి సినిమా అయినా సరే ఆమె గ్లామర్ కి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు తనకు ముఖ్యం కాదని తనకు నటన ముఖ్యం అని ఆమె చెప్తూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆమె రెండు సినిమాల్లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: