పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాల్లో మళ్ళీ నటించనంటూ రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్, సడెన్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే నటించబోయే సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉండేది. కానీ అనూహ్యంగా బాలీవుడ్ పింక్ సినిమాని రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యాడు.

 


నిజానికి ఈ సినిమాని సజెస్ట్ చేసింది దర్శకుడు త్రివిక్రమ్ అట. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. రీ ఎంట్రీ సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉండడంతో ఆ కాంబినేషన్ సెట్ అవలేదు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అనగానే త్రివిక్రమ్ బాలీవుడ్ పింక్ రీమెక్ ని సజెస్ట్ చేసాడట.

 

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర పవన్ కి బాగా సరిపోతుందని చెప్పారట. ఈ మేరకు వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిల్ రాజు గారు పవన్ తో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు త్రివిక్రమ్ సలహా ఇచ్చాడట. అపుడు వేణు శ్రీరామ్ లైన్లోకి వచ్చాడని సమాచారం. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. వకీల్ సాబ్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాస్తానని కూడా చెప్పాడట.

 

కానీ అల వైకుంఠపురములో సినిమా పనుల్లో బిజీగా ఉండడం, వకీల్ సాబ్ సినిమా అనుకున్న దానికంటే ముందే స్టార్ట్ అవడం వల్ల కుదరలేదట. లేదంటే వకీల్ సాబ్ చిత్రంలో మరోసారి త్రివిక్రమ్ మాటలు వినేవాళ్లం. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన ఈ చిత్రం, ప్రభుత్వ అనుమతుల మేరకు మరికొద్ది రోజుల్లో చిత్రీకరణకి వెళ్ళనుంది. ఈ సినిమాలో నివేథా థామస్, అనన్య పాండే ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: