టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి. సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది అనే మాట నిజం. ఆమె చేసిన సినిమాలు ఆమె పాత్రలు అన్నీ కూడా ఫెయిల్ అయినా ఆమె ను మాత్రం చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అన్నారు. మెగా హీరోలతో అలాగే నందమూరి హీరోలతో ఆమె సినిమాలు చేసింది. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమెను మాత్రం చాలా మంది స్టార్ హీరోయిన్ అనే విధంగా వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఇక ఆమె చాలా తక్కువ కాలంలో సినిమాలకు దూరం జరిగిన అసారే ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. ఇది పక్కన పెడితే ఆమె గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గేది కాదు. పాటల్లో అయితే ఆమె అందాలు అదుర్స్ అన్నారు అప్పుడు జనాలు. అగ్ర హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోవడానికి ఆమె తక్కువ సమయమే పట్టినా నటిగా మాత్రం ఆమెకు మంచి గుర్తింపు రాలేదు అనేది వాస్తవం. గ్లామర్ విషయంలో మాత్రం ఆమెకు చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పుకోవచ్చు. 

 

ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగానే ఉన్న సంగతి తెలిసిందే. ఏదో రెండు మూడు తెలుగు సినిమాల్లో ఆమె నటించే ప్రయత్నాలు చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అయినా సరే ఆమె కనపడుతుందా లేదా అనేది చెప్పడం ప్రస్తుతం కాస్త కష్టమే. ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు వచ్చిన సమయంలో టైం వేస్ట్ అని వదులుకుంది అంటారు టాలీవుడ్ జనాలు. ఇప్పుడు ఆమె మరి ఏ సినిమాల్లో కనపడుతుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: