స్టార్ హీరో ఏం చేసినా సరే ఆహా, ఓహో అనే అభిమానులు ఉంటారు. ఆ హీరో సినిమాను ఆడించాలన్నా.. సినిమా రిలీజ్  టైంలో హడావిడి చేయాలన్నా సరే ఫ్యాన్స్ ఉండాల్సిందే. అంతేకాదు టీజర్ దగ్గర నుండి సినిమా రికార్డులు బద్దలు కొట్టేదాకా వ్యూస్, లైక్స్ విషయంలో కూడా అభిమానుల కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అభిమానులు లేనిది హీరోలు లేరు ఇది అందరు అనే మాటే.. అందరికి తెలిసిన మాటే.. అయితే అభిమానులు చేసిన మంచి పనులకు ఎంత క్రేజ్ వస్తుందో వాళ్ళు చేసే చేదు పనులకు హీరో అంతే రెస్పాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. 


హీరోల ఇమేజ్ ను అంగట్లో పెట్టిన అభిమానులు చాలా సందర్భాల్లో హీరోలకు తలా నొప్పిగా మారిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా అలాంటి ఓ సంఘటన ఇప్పుడు అంతటా చర్చలకు దారి తీస్తుంది. హీరోయిన్ మీరా చోప్రాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం.. దారుణమైన కామెంట్స్ తో ట్రోల్ చేయడంపై ఆమె సీరియస్ అయ్యింది. ఇలాంటి ఫ్యాన్స్ తో స్టార్ అనిపించుకుని ఏం లాభం అని డైరెక్ట్ గా ఎన్టీఆర్ కు ట్యాగ్ చేసింది. ఈ విషయం రోజు రోజుకి సీరియస్ అవుతుండగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ ఓ వీడియో చేస్తాడని అనుకున్నారు. 


కానీ ఎన్టీఆర్ అసలు ఈ ఇష్యూ తనది కాదు అన్నట్టు లైట్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే తెలంగాణ క్రైం పోలీస్ రంగంలో దిగి 15 మంది ఎన్టీఆర్ అభిమానుల ట్విట్టర్ ఖాతాల ద్వారా వారి వివరాలు సేకరించి అరెస్ట్ కు సిద్ధం చేశారు. ఇలాంటి టైం లో అభిమానులకు ఓ మంచి మేసేజ్ ఇస్తే బెటర్ అని అంటున్నారు కొనరు. అయితే ఫ్యాన్స్ చేసే ప్రతి పనికి హీరో వకాల్తా పుచ్చుకోవడం కరెక్ట్ కాదు.. ఫ్యాన్స్ అయినా చేసింది తప్పు కాబట్టి ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండటమే బెటర్ అని కొందరు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: