చార్మీ... చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అగ్ర హీరోలు అందరితో కూడా ఆమె సినిమాలు చేసింది. ఆమె సినిమాలు చాలా వరకు కెరీర్ మొదట్లో మంచి విజయాలు సాధించాయి అని చెప్పవచ్చు. వెంకటేష్ తో బాలయ్య తో నాగార్జున తో ఆమె వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్ హీరోయిన్ గా కూడా పేరు వచ్చింది. అయితే ఆమె తనకు వచ్చిన స్టార్ ఇమేజ్ ని ఎక్కువ కాలం నిలుపుకోలేదు అని చెప్పవచ్చు. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె గుర్తింపు ని కాపాడుకునే విషయంలో చాలా వరకు ఫెయిల్ అయింది. 

 

ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు చాలా వరకు దూర౦గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఆమె గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా లోటు చూపించేది కాదు అనే మాట వాస్తవం. దర్శకుడు అడిగిన విధంగా ఆమె సినిమా చేస్తుంది అనే పేరు ఉంది. పాత్ర ఏ విధంగా ఉన్నా సరే ఆమె లో మాత్రం ఏ విధమైన భయం అనేది ఉండదు అని అంటారు. ఆమెకు తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం రావడానికి అదే కారణం అనేది చాలా మంది చెప్పే మాట. ఆమె ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో కనపడాలి అని ప్రయత్నాలు చేస్తుంది గాని పెద్దగా ఫలితం ఇచ్చే అవకాశాలు మాత్రం కనపడటం లేదు అని చెప్పాలి. 

 

ఇక ఆమె గ్లామర్ లో ఏ హీరోయిన్ కూడా సరిపోయే విధంగా ఉండేది కాదు అని చాలా మంది అప్పుడు కామెంట్స్ కూడా చేసారు కూడా. ఇక ఏది ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం తన అందంతో అభిమానులను అన్ని విధాలుగా కూడా ఆమె అలరించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: