టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియమణి. ఆమె చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లో ఆమె నటించింది. ఆమె సినిమాలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులకు గ్లామర్ తో పాటుగా నటనను కూడా అందించాయి. అయితే కెరీర్ మొదట్లో మాత్రం ఆమె తన అందాలను పెద్దగా చూపించలేదు గాని ఆ తర్వాత మాత్రం ఆమె పాత్రకు తగిన విధంగా కనపడింది. 

 

చిన్న చిన్న హీరోల సినిమాల్లో కూడా ఆమె అందాలను ఎక్కువగా చూపించింది. చిన్న చిన్న హీరోల సినిమాల్లో తాను హైలెట్ అయ్యే విధంగా ఆమె నటించింది. బికినీ వేసింది పాటల్లో కూడా అందాలను చూపించింది. ప్రతీ సినిమాలో కూడా ఆమె ఏదోక రూపంలో అందాలు చూపించింది. ఆమెకు తెలుగులో తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చినా పోటీ లో మాత్రం నిలబడలేదు ఆమె. అగ్ర హీరోలతో అవకాశాలను ఆమె పెద్దగా వాడుకోలేదు అని అంటారు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే వచ్చిన స్టార్ ఇమేజ్ ని ఆమె నిలబెట్టుకోలేదు అని అంటారు. 

 

ఇక ఇప్పుడు ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఒక సినిమా విరాట పర్వం కాగా మరో సినిమా నారప్ప. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె లుక్స్ ని చిత్ర యూనిట్స్ విడుదల చేసాయి. వీటికి మంచి స్పందన వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక తమిళంలో కూడా ఆమె వరుసగా సినిమా లు చేస్తూ వస్తుంది. అక్కడ అగ్ర హీరోలతో ఆమె సినిమాలను చేస్తున్నారు. తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: