సినిమా పరిశ్రమలో ఇన్నాళ్లు లోపల లోపల జరిగే గొడవలు ఈమధ్య బయట పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వంతో సినిమా షూటింగ్స్ విషయమై సినీ పెద్దలు జరిపిన చర్చలకు తనని పిలవలేదని బాలకృష్ణ చేసిన కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోనే కొందరు బాలకృష్ణకు సపోర్ట్ చేయగా.. చాలామంది బాలకృష్ణ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. ఇదిలాఉంటే జూన్ 9న ఎపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినిమా పెద్దలు కలిసే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. 

 

ఆ మీటింగ్ కు కూడా బాలకృష్ణ మిస్ అవుతాడని తెలుస్తుంది. బాలకృష్ణ 60వ పుట్టినరోజు జూన్ 10న జరుగనుంది. అందుకే ముందు రోజు చాలా బిజీ అంటున్నాడట. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు పిలవలేదని అలిగిన బాలయ్య ఎపి సీఎంతో చర్చలకు పిలిచినా వెళ్లే ఆలోచలో లేడట. ఇదిలాఉంటే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని తన సోషల్ బ్లాగ్ లో స్పందిస్తున్నాడు. బాలయ్య ఎపిసోడ్ లో తన తప్పు ఉందా లేదా అన్నది పక్కన పెడితే బాలకృష్ణ అలా మాట్లాడటం చిరు మనసుని కొంత కష్టపెట్టిందని అంటున్నారు. 

 

అందుకే బాలకృష్ణ పుట్టినరోజు నాడు చిరు విష్ చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ ఆరోజు చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపితే ఈ గొడవకు ముగింపు పలికినట్టే అంటున్నారు. ప్రతి విషయాన్ని తన సోషల్ బ్లాగ్ ద్వారా తెలిపే చిరంజీవి, బాలకృష్ణ పుట్టినరోజు విషెస్ చెబుతాడా లేడా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చిరంజీవి బాలకృష్ణ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న గొడవలు జరిగినా అవి జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళేవే. బాలకృష్ణ విషయాన్ని చిరంజీవి ఎంత సీరియస్ గా తీసుకున్నాడు అన్నది బర్త్ డే విష్ ను బట్టి తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: