సిల్క్ స్మిత... తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు చాలా మందికి ఒక కనపడని హుషారు. ఆమె తెర మీద కనపడుతుంది అంటే చాలు చాలా మందికి ఒకరకంగా పండగ లాంటి వాతావరణం. ఆమె చేసిన సినిమాలు ఆమె చేసిన పాటలు అన్నీ కూడా చాలా మందికి నచ్చాయి. ఐటెం సాంగ్స్ ని తెలుగు స్క్రీన్ కి సరికొత్తగా చూపించింది సిల్క్. టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సర్ ఎవరికి లేని డిమాండ్ ఆమె సొంతం. స్టార్ హీరోయిన్ అయినా స్టార్ హీరో అయినా సరే ఆమె కోసం ఎదురు చూసే విధంగా ఆమె పేరు తెచ్చుకున్నారు.

 

అగ్ర హీరోలతో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం సినిమాలో ఎప్పుడు కూడా హైలెట్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన కాదు గాని ఆమె హావ భావాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆమె నటనకు దర్శక నిర్మాతలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు గాని ఆమె అందానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అనే ఆరోపణలు చాలానే వచ్చాయి అప్పట్లో. ఆమె స్క్రీన్ మీద కనపడితే అప్పుడు కాసుల వర్షం అనే విధంగా ఆమె నటించింది అనేది వాస్తవం. 

 

ఆమె చాలా తక్కువ కాలంలో చాలా మంచి స్టార్ హీరోలతో సినిమాలు చేసారు. ప్రతీ సినిమా కూడా ఒక సంచలనం. ఆమె కెరీర్ లో గ్లామర్ కి చాలా వరకు ప్రాధాన్యత ఉండేది అప్పట్లో అనే విషయం అందరికి తెలిసిందే. ఏ హీరో అయినా సరే ఆమె గ్లామర్ కి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తూనే ఆమెను సినిమాల్లోకి తీసుకునే వారు అని అంటారు... ఆమె బయోపిక్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: