సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైం లో రిలీజ్ చేసిన సినిమా క్లైమాక్స్. ప్రపంచం మొత్తం ఆగిపోయినా తాను చేయాలని అనుకున్నది చేస్తా అని చెప్పిన ఆర్జీవీ క్లైమాక్స్ ట్రైలర్ తో అందరికి షాక్ ఇచ్చాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో అప్పట్లో ఓ అడల్ట్ మూవీ చేసిన వర్మ ఆమెతో ఓ థ్రిల్లర్ మూవీ చేశాడు. క్లైమాక్స్ టైటిల్ తో వచ్చిన ఈ మూవీని డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ చేశాడు ఆర్జీవీ. 

 

ఆర్జీవీ వరల్డ్ పేరుతొ శ్రేయాస్ మీడియా సపోర్ట్ తో శ్రేయాస్ ఈటి ఓటిటి ద్వారా శనివారం రాత్రి 9 గంటలకు క్లైమాక్స్ మూవీ రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమా చూడాలంటే 100 రూపాయలు చెల్లించాల్సిందే. పే పర్ వ్యూ ద్వారా ఈ మూవీని చూసే అవకాశం కల్పించాడు వర్మ. అయితే ఆర్జీవీ వేసిన పే పర్ వ్యూ ప్లాన్ బెడిసి కొట్టేలా తమిళ్ రాకర్స్ అదిరిపోయే షాక్ ఇచ్చారు. క్లైమాక్స్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా హెచ్,డి ప్రింట్ తమ సైట్ లో పెట్టేశారు. 

 

వర్మకే షాక్ ఇచ్చేలా చేసిన తమిళ్ రాకర్స్ కేవలం వర్మ సినిమాలనే కాదు ఇదివరకు చాలా సినిమాలను రిలీజ్ నాదే వాళ్ళ సైట్ లో పెట్టేశారు. ఇక ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కాబట్టి ఈ పైరసీని ఆపడం సాధ్యం కాదు. 100 రూపాయలకు సినిమా కదా అది కూడా లాక్ డౌన్ టైం లో కాబట్టి వ్యూస్ బాగానే వస్తాయని భావించాడు ఆర్జీవీ. కానీ ఆ 100 కూడా పెట్టకుండా ఫ్రీ షో వేస్తుంటే ఇక అనవసరంగా 100 ఎందుకు పెడతారు చెప్పండి. మొత్తానికి తమిళ్ రాకర్స్ చేసిన పనికి ఆర్జీవీ ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: