ఒకసారి సినిమాలలోకి వచ్చిన తర్వాత దర్శకుడు అడిగింది చెయ్యాలి... నిర్మాత కోరికకు తగిన విధంగా హీరోయిన్ అయినా హీరో అయినా సరే చెయ్యాల్సి ఉంటుంది. అగ్ర హీరోలు అయినా అగ్ర హీరోయిన్ అయినా సరే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నటించే పరిస్థితి ఉండదు అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇది నచ్చుతుంది కొంత మందికి ఏ మాత్రం నచ్చే అవకాశం ఉండదు. ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే మాత్రం చాలా వరకు అందాలు చూపించాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అందం చూపిస్తేనే ఆమెకు గుర్తింపు. 

 

అయితే కొందరు హీరోయిన్ లు మాత్రం అందం చూపించకపోయినా సరే టాలీవుడ్ లో నిలబడ్డారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత వరకు చూపించాలో అక్కడి వరకే చూపించారు సినిమాలను చేసారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఎలా చూపించినా సరే చాలా హుందాగా స్కిన్ షో చేసే వారు గాని ఎక్కడా కూడా అసభ్యంగా ఉండే విధంగా ఆమె నటించిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఆమెకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు అయినా చిన్న చిన్న నిర్మాతలు అయినా సరే ఆమెను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. 

 

ఆమె చాలా వరకు హుందాగా నటించారు అని చెప్పవచ్చు. పాత్ర ఏది అయినా సరే గ్లామర్ కి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు నటనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళారు. అందుకే చాలా తక్కువ కాలంలో ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె లేకపోయినా సరే ఆమె చేసిన సినిమాలు ఆమె అందం అన్నీ కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉన్నాయి అంటే అదే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: