బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోగా త్వరలోనే తక్కువా క్రూతో ట్రిపుల్ ఆర్ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపిస్తాడని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక కొమరం భీం పాత్రలో తారక్ మరో  అంటున్నారు. 

 

ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన నటుడని చెప్పుకునే తారక్ ను రాజమౌళి అదరగొట్టేలా చేస్తున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఒకటి సాఫ్ట్ గా కనిపించేలా ఉండగా మరోటి భారీ దేహదారుడ్యంతో కనిపిస్తాడట. ఆ టైం లోనే ఓ భారీ యాక్షన్ సీన్ కూడా ఉంటుందని.. థియేటర్ లో ఆ యాక్షన్ సీన్ కు ఎవరు సీట్లలో కూర్చునే అవకాశం ఉండదని అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఆర్.ఆర్.ఆర్ ను తమ భుజాల మీద మోస్తున్నారని తెలుస్తుంది. 

 

ఒకే కాలానికి చెందిన ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్.. రియల్ లైఫ్ లో వాళ్ళిద్దరికీ అసలు పరిచయం లేకున్నా.. ఇద్దరు కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే అనే కల్పిత కథతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో ఇద్దరి పాత్రలు చాలా గంభీరంగా ఉండబోతున్నాయని టైటిల్ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. నీరుతో తారక్, నిప్పుతో చరణ్ చేసే ప్రక్షాళన ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. సినిమా మాత్రం మరో బాహుబలి కాదు కాదు దానికి మించి సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.             

మరింత సమాచారం తెలుసుకోండి: