చాలా మంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలదొక్కుకోవడానికి అందాల ఆరబోతను  ఒక అస్త్రంగా మార్చుకుంటారు అనే విషయం తెలుసిందే . కొంతమంది హీరోయిన్లు ఇలా ఆరబోత చేసి వరుస అవకాశాలు దక్కించుకుని ఎంతో ఫేమస్ అయితే కొంత మంది మాత్రం సినిమా అవకాశాలను దక్కించుకోలేక పోతారు. ఇలా  అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలను ఆకర్షించి  స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. అదే సమయంలో అందాలు ఆరబోసినప్పటికి కూడా అవకాశాలు దక్కించుకోని  వారు కూడా ఉన్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో అందాలు ఆరబోసినప్పటికీ... అందాలతో సెన్సేషన్  సృష్టించినప్పటికీ అవకాశాలు దక్కించుకోని  హీరోయిన్లలో ఒకరు రష్మీ. 

 


 తెలుగు ప్రేక్షకులందరికీ రష్మీ సుపరిచితురాలు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు వరకు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి తన సినీ కెరీర్ ప్రారంభించిన రష్మీ ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా ఎంతగానో  గుర్తింపు సంపాదించుకుంది . ఇక జబర్దస్త్ లో తన అందం అభినయంతో ఆకట్టుకోవడంతో వెండి తెరపై కూడా అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మకి. ఈ క్రమంలోనే గుంటూరు టాకీస్ అనే సినిమాలో నటించింది రష్మి గౌతమ్. అయితే రష్మి గౌతమ్ కి మొదటి సినిమా అయినప్పటికీ ఈ అమ్మడు ఆరబోసిన అందాలు మాత్రం టాలీవుడ్ ని షేక్ చేసాయి అనే  చెప్పాలి. గుంటూరు టాకీస్ సినిమా విజయం సాధించింది అంటే అది కేవలం అందాల ఆరబోత ద్వారానే అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. 

 


 ఈ సినిమాలో రష్మి గౌతమ్ ఆరబోసిన అందాలు ఇప్పటికికూడా తెలుగు ప్రేక్షకులు హీట్ పుట్టిస్తోనే  ఉన్నాయి. మొదటి సినిమాలోనే అందాల ఆరబోతతో రెచ్చిపోవడంతో వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు. అడపాదడపా రెండు మూడు చిన్న సినిమాలు వచ్చాయి కానీ సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు రష్మి గౌతమ్ కి. దీంతో ఈ అమ్మడు ఎంతలా అందాలు ఆరబోసినప్పటికీ అది కాస్తా వృధా అయిపోయింది అని చెప్పాలి. తన అందాల ఆరబోతతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించినప్పటికీ... అవకాశాలను మాత్రం చేజిక్కించుకోలేకపోయింది  రష్మి గౌతమ్. ప్రస్తుతం బుల్లితెర తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: