పంచదార బొమ్మ లా కనిపించే ఆర్తి అగర్వాల్ అర్ధాంతరంగా కాలం చేసి భారత సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చింది. నువ్వు నాకు నచ్చావు, ఇంద్ర, నువ్వు లేక నేను లేను, వసంతం, నీ స్నేహం, అడవి రాముడు, అల్లరి రాముడు బాబి వంటి చిత్రాలలో సంప్రదాయకమైన పాత్రల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో ఎదురులేని హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ దూసుకెళ్లింది. కాస్త బొద్దుగా తయారవడంతో హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లిన తర్వాత సైడ్ క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అందాల రాముడు చిత్రంలో సునీల్ సరసన చీరకట్టు అందాలతో సాంప్రదాయమైన అమ్మాయిలా కనిపించి అందర్నీ ఫిదా చేసేసింది. ఆర్తి అగర్వాల్ హీరో ఉపేంద్ర తో ముద్దు సన్నివేశంలో నటించి ఫిదా చేసేసింది.

IHG
ఆమె కేవలం సాంప్రదాయకంగా మాత్రమే కాదు సెక్సీ హీరోయిన్ గా కూడా అనేక సినిమాల్లో నటించింది. హలో సుబ్రహ్మణ్యం సినిమాలో చీరకట్టు అందం లో కనిపించిన ఆర్తి అగర్వాల్ తన పైట జారగొడుతూ అభిమానుల నోట చొంగ కార్పించింది. వనకన్య వండర్ వీరుడు, పోసాని కృష్ణమురళి నటించిన పోసాని జెంటిల్ మాన్ వంటి సినిమాలలో చీరకట్టు అందాలతో శృంగార భరితమైన సన్నివేశాల్లో నటించిన ఆర్తి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతి సినిమాలో కూడా ఆర్తి అగర్వాల్ చీరకట్టులో చాలా సెక్సీ గా కనిపించింది. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం గతంలో కూడా ఒక గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది.

IHG
2000-2010 మధ్యకాలంలో సాంప్రదాయకంగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, ఒంటినిండా నగలు పెట్టుకుని ఒకవైపు క్యూట్ గా కనిపిస్తూనే మరోవైపు హాట్ గా కనిపించిన ఏకైక తెలుగు హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ పేరు తెచ్చుకుంది. అప్పట్లో కుర్రకారు ఆమెకు వీరాభిమానులు అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. తనకు అనారోగ్య సమస్యలు రాకపోతే ఇప్పటికీ ఏదో ఒక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించేదేమో. ఏది ఏమైనా ఆమెను కోల్పోవడం తెలుగు ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: