తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. హీరోయిన్ అన్న తర్వాత అందం అభినయం నటన తో  పాటు అదృష్టం కూడా బాగా కలిసి రావాలి అనే విషయం తెలిసిందే. అందం అభినయం నటన ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు అంటే అవకాశాలు కూడా ఆ హీరోయిన్ దరిచేరవు. ఇలా చాలా మంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదుగుతారు  అనుకుంటున్న తరుణంలో అవకాశాలు లేక కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి మొదట్లో మంచి క్రేజ్ సంపాదించి ఆ తర్వాత అవకాశాలు అందుకోలేక చిత్ర పరిశ్రమకు దూరమైన హీరోయిన్లలో ఒకరు ఆద శర్మ. ఆద శర్మ అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. 

 


 ముఖ్యంగా హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మ... మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో వరుసగా అవకాశాలు కూడా దక్కించుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం తగ్గాయి. దీంతో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకకుంది  ఆద శర్మ. అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఆరబోసిన అందాలు నెటిజన్లలో హీట్ పుట్టించాయి  అనే చెప్పాలి. 

 


 అందరిలో హిట్ పుట్టించి అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి అందాల ఆరబోతకు అటు సోషల్ మీడియా మొత్తం ఊగి పోయింది అనే చెప్పాలి. కానీ ఏం లాభం ఎంతలా అందాలు ఆరబోసినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో అందాలు ఆరబోసిన ఈ అమ్మడి ప్రయత్నాలు మాత్రం వృధా అయిపోయాయి అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు తెరపై ఎక్కడా కనిపించడంలేదు ఆద శర్మ. మొదటి నుంచి ఈ అమ్మడికి అంతగా అదృష్టం కలిసి రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: