ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లు  చాలామంది అందాల ఆరబోత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా అందరు హీరోయిన్లు అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలను ఆకర్షించడంతో పాటు ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ  ఉంటారు. ఇలా అందాల ఆరబోతతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు మెహరీన్ . ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెహరీన్ కౌర్ కి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అన్ని సినిమాలలో తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు తన అందం అభినయంతో కూడా... తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. 

 

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మెహరీన్  తన అభినయంతో   ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది  అన్న విషయం తెలిసిందే. మొదటినుంచి గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. చేసిన ప్రతి సినిమాలో కాస్త ట్రెడిషనల్ లుక్ తోనే ప్రేక్షకులను ఆకర్షించింది. తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక అందాల ఆరబోతకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఒక సినిమాలో మాత్రం తన అందాల ఆరబోతతో సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది మెహరీన్ . 

 


 అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా లో  తమన్నాతో కలిసి నటించిన మెహరీన్ వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. అయితే ఈ సినిమాలో కూడా కాస్త అందాల ఆరబోతకు దూరంగానే ఉంటూ తన క్యూట్ క్యూట్ అందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. కానీ ఒక్క సన్నివేశంలో మాత్రం ఈ అమ్మడు అందరికీ షాక్ ఇస్తూ... హీట్  పుట్టించే  అందాలను ఆరబోసింది అనే చెప్పాలి. ఎఫ్ 2 సినిమాలో  తమన్నా మెహరీన్ బికినీలు వేసుకుని నడుచుకుంటూ వచ్చే  ఒక సీన్  ఉంటుంది. ఆ సీన్ లో అటు తమన్నా ఇటు మెహరీన్ హాట్ హాట్ అందాలతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు హీటు పుట్టించారు. తమన్నా మొదటినుంచి గ్లామర్ పాత్రల్లో చేస్తుంది.. కానీ మెహరిన్ అంతకుముందు వరకు ట్రెడిషినల్ లుక్ తో కనిపించి ఒక్కసారిగా బికినీ అందాలతో రెచ్చిపోయే సరికి అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: