తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమదైన ట్రెండ్ సృష్టించి స్టార్ హీరోయిన్గా పాతుకు పోతు  ఉంటారు . అటు దర్శక నిర్మాతలను నెటిజన్లను మరోవైపు ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తూ... ఎంతగానో క్రేజ్ సంపాదిస్తూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ రేంజ్ లో క్రేజ్ సంపాదించి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతున్న వారిలో ముందు వరుసలో ఉంటారు తమన్నా. మిల్కీ బ్యూటీ గా తెల్లతోలు హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. మొదటి నుంచి ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించిన తమన్నా మరో వైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. 

 


 అయితే మొదటి నుంచి ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది  ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా హవా  నడిపించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగింది. దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అమ్మడి అందాల ఆరబోత గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. అయితే కేవలం సినిమాలలో సాదాసీదా అందాలను ఆరబోసినప్పటికీ నెట్టింట్లో మాత్రం అందరిలో  హిట్ పుట్టించే అందాల ఆరబోతతో హీరోయిన్ అందరిని ఫిదా చేసింది అనే చెప్పాలి. 

 


 ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా అదిరిపోయే అందాలు అంటే అందరికీ గుర్తొచ్చేది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమాలోని ఒక సన్నివేశము. ఒక సీన్లో మిల్కీ బ్యూటీ తమన్నా బికినీ అందాలతో అలా నడుచుకుంటూ వస్తుంటే... తమన్నా సొగసులు చూసి తెలుగు ప్రేక్షకుల మతి పోయింది అనే చెప్పాలి. ఆ బికినీ అందాలను చూసి తెలుగు ప్రేక్షకులు ఎన్నో రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా  తన బికినీ అందాలతో టాలీవుడ్ ని షేక్  చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: