ప్రస్తుత జనరేషన్ లో అయితే అందాల ఆరబోత చేయకుండా కొంత మంది హీరోయిన్లు  మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్లు. కానీ చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత అందాల ఆరబోత చేయకుండా ఎక్కడ నిలుదొక్కుకోలేం  అన్నది ఒక బలమైన వాదన ఉంది. అయితే చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఇలా కొంతమంది అందాల ఆరబోతతో అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు కూడా ఉన్నారు. కొంతమంది అవకాశాల కోసం అందాల ఆరబోత చేస్తే కొంత మంది ప్రేక్షకులను అలరించడానికి అందాల ఆరబోత చేశారు. 80, 90 లలో ఈ అందాల ఆరబోత ప్రారంభమైంది అని చెప్పాలి. అయితే ఇలా అందాలు ఆరబోసి... కైపెక్కించే  చూపులతో... ఓవైపు దర్శక నిర్మాతలను మరోవైపు ప్రేక్షకులను ఆకర్షించిన  హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇలా అందాల ఆరబోతతో ఎంతోమంది మతిపోగొట్టిన హీరోయిన్లలో ఒకరు రమ్యకృష్ణ. 

 

 ఆనాటి కాలంలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ రమ్యకృష్ణ కు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్. అప్పట్లో నటనకు  ప్రాధాన్యం ఉన్న పాత్ర లతో పాటు అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పాత్రలకు కూడా రమ్యకృష్ణ కేరాఫ్ అడ్రస్ గా మారింది. స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది రమ్య కృష్ణ. నాటి తరం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపుగా అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించింది రమ్యకృష్ణ. 

 


 అయితే అప్పట్లో తన అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ కి వయసు ధాటి పోతుంది కానీ అందం మాత్రం తరగడం లేదు. అప్పటికీ ఇప్పటికీ అదే అందం అదే అభినయం. హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే అందంతో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తన అభినయంతో ఆకట్టుకుంటుంది రమ్యకృష్ణ. నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకు అందరినీ అలరిస్తోంది. ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ఉన్న స్టార్ గానే కొనసాగుతుంది రమ్యకృష్ణ. అప్పటికీ ఇప్పటికీ రమ్యకృష్ణ క్రేజ్  ఎక్కడా తగ్గలేదు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: