అగ్ర హీరోల సినిమాలు అనగానే ఈ మధ్య ఒక రేంజ్ లో క్రేజ్ వస్తుంది. సినిమా ఏ విధంగా ఉన్నా సరే సినిమాకు పెట్టిన పెట్టుబడితో పాటుగా మార్కెట్ కూడా భారీగానే జరుగుతూ ఉండటం నిర్మాతలకు బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో మార్కెట్ నుంచి ప్రధాన మార్కెట్ వరకు అన్నీ కూడా ఇప్పుడు హైలెట్ గానే ఉన్నాయి. ఇక దీనికి తోడు డ‌బ్బింగ్ హ‌క్కులు.. హిందీ హ‌క్కుల రూపంలో కూడా పెద్ద హీరోల సినిమాల‌తో నిర్మాత‌ల‌కు భారీగా ఆదాయం వ‌చ్చి చేరుతోంది. దీంతో హీరోల రెమ్యున‌రేష‌న్లు చుక్క‌ల్లోకి వెళ్లిపోయాయి.

 

అయితే ఇదంతా నిన్న‌టి సంగ‌తి.. కరోనా దెబ్బకు ఆ మార్కెట్ భారీగా పడిపోయింది. తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే హీరోలకు ఇక కేవలం పారితోషికం మాత్రమే ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హీరోలకు బయటి మార్కెట్ ని ఏ మాత్రం ఇవ్వొద్దు అని... ప్రీ రిలీజ్ కి ముందు జరిగే మార్కెట్ ని అసలు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు అని ఒక నిర్ణయానికి నిర్మాతలు అందరూ వచ్చినట్టు టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. 

 

ఇప్పుడు ప్రీ రిలీజ్ కి ముందు మార్కెట్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. జనాలు ఎలాగూ థియేట‌ర్ల‌ కి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లో ఉండి సినిమాలను చూస్తారు. అప్పుడు మార్కెట్ పెరిగితే ఆ మార్కెట్ ని హీరోలు తీసుకుంటే మనం నాశనం అవుతాం అని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే నో చెప్పారట మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: