మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే నిహారికా మాత్రం స్టార్ హీరోయిన్ అవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె ఇప్పుడు ఒక సినిమా చేసినా సరే చాలు అనుకునే పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఆమెకు మాత్రం అవకాశాలు అనేవి ఏ విధంగా చూసినా సరే రావడం లేదు. ఇక ఆమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో నిర్మాతలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. మోగా ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ అయినా ఆమెకు గ్లామర్ తరహా క్యారెక్టర్లు ఆఫర్ చేస్తే అది వేరే విధంగా ఉంటుందన్న ఇబ్బందితో దర్శక నిర్మాతలు ఉన్నారు.
అయితే దీంతో పాటు ఆమెకు ఛాన్సులు ఇవ్వకపోవడానికి కారణం వేరే ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమెకు అవకాశాలు ఇవ్వొద్దని చిరంజీవి చెప్పారు అని... ఆయన ఆమెను హీరోయిన్ గా అసలు వద్దు అంటున్నారు అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ తరుణంలో టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఆమెకు పవన్ తన సినిమాలో ఒక కీలక పాత్రకు అవకాశం ఇవ్వాలి అని చూశారు అని వార్తలు వస్తున్నాయి.
దీనిని చిరంజీవి వద్దని చెప్పినట్టు అంటున్నారు. ఆ పాత్రలో ఆమె గ్లామర్ గా కనపడాలి అని... ఆమె గ్లామర్ గా కనపడటం చిరంజీవి కి అసలు ఇష్టం లేదని అందుకే నాగ బాబుకి ఇదే విషయాన్ని ఆయన చెప్పారు అని అంటున్నారు. దయచేసి ఆమెను సినిమాలకు దూరంగా ఉండమని లేదా ఏదైనా పద్దతిగా ఉండే పాత్రలు చేసుకోవాలి అని చెప్పినట్టు తెలుస్తోంది. మరి నిహారిక ఇకపై సినిమాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ..?