ప్రస్తుతం మన తెలుగులో హీరోల పెళ్ళిళ్ళ సందడి ఒక రేంజ్ లో ఉంది అనే మాట అందరికి తెలిసిందే. రానా పెళ్లి అవడానికి రెడీ గా ఉంటే నితిన్ పెళ్లి కూడా దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్ళింది. నితిన్ పెళ్లికి రెండు సార్లు ముహూర్తం కుదిరినా కూడా క‌రోనా ఎఫెక్టు తో వాయిదా ప‌డ‌క త‌ప్ప‌లేదు. ఇక నిఖిల్ సైలెంట్ గా ఏ గొడవ లేకుండా వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో పెళ్ళి వార్త బయటకు వచ్చింది. శర్వానంద్ పెళ్లి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

 

శర్వా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సమాచారం. అతను రామ్ చరణ్ క్లాస్ మేట్, వీరితో కలిసి చదువుకున్న ఒక అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. వీరిద్ద‌రు గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్నార‌ని.. ఇరు వైపులా పెద్ద‌ల‌ను కూడా ఒప్పించార‌ని టాక్‌.. ?  ఈ వివాహం త్వరలోనే జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ పెళ్ళికి సంబంధించిన చర్చలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుంది అంటున్నారు. 

 

ఇక శ‌ర్వాకు కాబోయే భార్య ప్ర‌స్తుతం చెన్నైలో జాబ్ చేస్తోంద‌ట‌. వాళ్ల కుటుంబం శ‌ర్వా కుటుంబానికి ముందే తెలుస‌ట‌. వీరి పెళ్లిపై ఇప్పుడు కొన్ని కొన్ని చర్చలు జరుగుతున్నాయని... అన్నీ పూర్తి అయిన తర్వాత శర్వా సోషల్ మీడియాలో రానా మాదిరిగానే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి శ‌ర్వా కూడా ఓ ఇంటివాడు అయిపోతున్నాడ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: