ఎప్పుడో పదేళ్ళ క్రితం తెలుగులో అలరించింది సమీరా రెడ్డి. ఆమె తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఆ తర్వాత కనపడకుండా పోయింది. బాలీవుడ్ లో కొన్ని రోజులు అలరించిన ఆమె ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనపడలేదు. ఇక ప్రేమ వ్యవహారాలు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాయి అని చెప్పవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించిన ఆమె అప్ప‌ట్లో ఓ యువ హీరోతో న‌డిపిన ప్రేమాయ‌ణంతో బాగా వార్త‌ల్లోకెక్కింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె మళ్ళీ తెలుగులో నటించే అవకాశాలు ఉన్నాయి. 

IHG

ఆమె ప్రభాస్ సినిమాలో ఒక వ్యాపారవేత్తగా కనపడే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తి చేసుకుందని... అయితే రెమ్యున‌రేష నే కాస్త ఎక్కువ అడిగిందని నిర్మాత కాస్త సర్ది చెప్పడంతో ఆమె వెనక్కు తగ్గింది అంటున్నారు. ఆమె మినహా ఆ పాత్రకు ఎవరూ కూడా సరిపోయే అవకాశం ఉండదు అని అందుకే ఆమెను అడిగారు అని టాక్. నిజమో కాదో గాని ఈ సినిమాలో మాత్రం స‌మీరా నటించడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. 

 

ఒకప్పుడు అగ్ర హీరోలతో సినిమాలు చేసి వివాదాలతో ఆమె దూరం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాకు ఆమె దగ్గర అయ్యే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు సమాచారం. అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. వేరే సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నారు. మరి ఎంత వరకు ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది చూడాలని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: