భాషాల‌తో నిమిత్తం లేకుండా త‌న న‌ట‌న‌తో  దేశ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్‌. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత క‌థ ఆధారంగా ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో తానే టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న మాధ‌వ‌న్ ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం నంబి నారాయ‌ణ‌న్ జీవితం..అతిని ప్ర‌స్థానం,ప్రయాణం గురించి తెలుసుకోవాడ‌నికి రెండేళ్లు ప‌ట్టింద‌ని మాధ‌వ‌న్ కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు. అలాగే నంబి నారాయ‌ణ‌న్ గెట‌ప్ కుద‌ర‌డానికి షూటింగ్ స‌మ‌యంలో 14గంట‌లు కూర్చోవాల్సి వ‌స్తోంద‌ని చెప్పుకొచ్చాడు.

 

 అయితే ఈ సినిమాలో మాధవన్ మూడు విభిన్న ఆకారాల్లో కనిపిస్తారని మొదట వార్తలు వినిపించాయి. చిత్రంలోని తన లుక్‌కు సంబంధించిన ఫొటోల‌ను మాధవన్ విడుదల చేశారు. అలాగే సెట్స్‌లో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌తో దిగిన ఫొటోలను మాధవన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో మాధవన్‌ను చూస్తుంటే అచ్చం నంబి నారాయణన్‌లానే ఉండ‌టం విశేషం. ఈ లుక్ చూస్తుంటే నంబి నారాయణన్‌లా కనిపించడానికి మాధవన్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోందంటూ సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వ్య‌క్తం అవుతున్నాయి.  సినిమా కోసం, పాత్ర కోసం మాధవన్ నిబద్ధత చూస్తుంటే ఎవరైనా హ్యాట్సాఫ్ అనక మానరు అంటూ ఆయ‌న అభిమానులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.  


ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమంటే బాలీవుడ్ బాద్‌షా మాధ‌వ‌న్ చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారంట‌. అంతేకాదు ఈ సినిమాలో ఎంతో కీల‌క‌మైన పాత్ర అంట‌.ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్‌ను ఇంట‌ర్వ్యూ చేసి, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో షారూక్ ఖాన్ క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ 2018లో న‌టించిన చిత్రం ‘జీరో’ సినిమా బారీ డిజాస్ట‌ర్గా నిలిచిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి షారూక్ మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. జీరోలో మాధ‌వ‌న్ అతిథి పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే. మాధ‌వ‌న్ అడిగే షారూక్ కాద‌న‌లేక ఒప్పేసుకున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: