పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేవలం 25 సినిమాల్లో నటించారు. అయితే తన సినీ కెరీర్ లో 12 సినిమాలకి ప్రారంభమయ్యి అర్థాంతరంగా ఆగిపోయిన సినిమాలు 12 ఉన్నాయ్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అవేంటో ఒక్కసారి ఈ ఆర్టికల్ లో లుక్కేసుకుందాం.

IHG

1. పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా పటించాలనుకునే చిత్రం చెప్పాలని ఉంది కాగా... దీనిని సూర్య మూవీస్ ప్లాన్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. కానీ ఇదే సినిమాని నువ్వే కావాలి పేరుతో తెరకెక్కించడం తో పవన్ కళ్యాణ్ సినిమా ఆపేయాల్సి వచ్చింది. 

IHG
2. పవన్ కళ్యాణ్ జానీ సినిమా ద్వారా రచయిత గా, డైరెక్టర్ గా, ఫైట్ కొరియోగ్రాఫర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూడా తను దర్శకుడిగా, రచయితగా తెలుగు చలన చిత్ర రంగంలో కొనసాగుదామని భావించారు. ఆ ఆలోచనలతోనే తన జానీ సినిమా తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా కథ రాసుకున్నాడు. ఆ కథతో తెరకెక్కించే సినిమాకి సత్యాగ్రహి అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ సినిమా ఎ.ఎం రత్నం నిర్మాణంలో సెట్స్ పైకి ఎక్కి అర్థాంతరంగా ఆగిపోయింది. 

IHG
3. ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా జీసస్ క్రైస్ట్ అనే సినిమాని తెరకెక్కించాలని సింగీతం శ్రీనివాస్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. తమిళ, హిందీ, తెలుగు మలయాళం, కన్నడ వంటి భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తాను అనుకున్నాడు. జీసస్ పాత్రలో పవన్ కళ్యాణ్ ని నటింప చేయాలని అతడిని సంప్రదించగా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దాంతో సింగీతం శ్రీనివాస్ జీసస్ క్రైస్ట్ సినిమాని పవన్ కళ్యాణ్ తో తీస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఏవో కారణాల వలన ఈ సినిమా అటకెక్కింది. 

IHG
4. దేశీ: పవన్ కళ్యాణ్ భారతదేశంపై తనకు ఉన్న భక్తిని కథ రూపంలో రాసుకున్నాడు. ఆ కథను దేశీ అనే పేరు తో వెండితెరపై చూపించాలని అనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. 

IHG
5. డాన్స్ మాస్టారు, నిర్మాత, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని అనుకునేవాడు. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ఫిక్స్ చేశాడు కానీ అది అర్థాంతరంగా ఆగిపోయింది. 

IHG
6. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్ర కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడు. ఆ రాయలసీమ నేపథ్యంలో కొనసాగే కథకి కోబలి అనే టైటిల్ అనుకోని పవన్ ని సూపర్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. 

IHG
7. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్ కి సోదరుడిలా పవన్ కళ్యాణ్ నటించాలి అనుకున్నాడు కానీ ఏవో కారణాల వలన తాను తప్పుకోవడం వలన మహేష్ బాబు అతడు వదులుకున్న పాత్రలో నటించాడు. 


8. యాక్షన్ సినిమాల దర్శకుడు వి.వి.వినాయక్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు. అధికారికంగా పవన్ కళ్యాణ్ తో తను సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు కూడా. కానీ ఆ చిత్రం ఆదిలోనే అంతమయ్యింది. 


9. గబ్బర్ సింగ్ 2 చిత్రంలో తాను హీరోగా నటించబోతున్నానని... రామ్ చరణ్ రచ్చ సినిమా తెరకెక్కించిన సంపత్ నంది తన దర్శకత్వం వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ అప్పట్లో అధికారికంగా ప్రకటించాడు. ఏమైందో ఏమో కానీ ఈ చిత్రం తెరకెక్కే కుండా మధ్యలోనే ఆగిపోయింది. 


10. ఎస్. జే సూర్య తో కలిసి పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి ఒప్పుకొని చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశాడు. కానీ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కాటమరాయుడు కంటే కొన్ని నెలల ముందు ఈ సినిమా ప్రారంభం అయిందని తెలుస్తుంది. 


11. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి డైరెక్టర్ నిసన్ దర్శకత్వం వహించాడు. అయితే ఇదే సినిమాను తెలుగులో తెరకెక్కిద్దామని పవన్ కళ్యాణ్ అనుకోని సినిమా చిత్రీకరణ ప్రారంభించాడు. కానీ ఈ చిత్రం కూడా అలా ప్రారంభమై ఇలా ఆగిపోయింది. 


12. పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా లతో తెరకెక్కిన ఖుషి సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ దానికి సీక్వెల్ గా ఖుషి 2 చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పగా... తన అభిమానులంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా చేస్తున్నట్టు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక తను ఖుషి 2 సినిమా తీస్తాడో లేదో చుడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: