యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం రాజ‌కీయంగాను.. సినిమాల ప‌రంగాను సంచ‌ల‌నం రేపుతున్నారు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు పెద్ద‌లు చిరంజీవితో క‌లిసి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆద్వ‌ర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి ఇండ‌స్ట్రీలో కొంత మందికి మాత్ర‌మే పిలుపు వ‌చ్చింది. బాల‌య్య‌ను కూడా పిల‌వ‌లేదు. దీంతో బాల‌య్య రుస‌రుస లాడారు. వీళ్లంతా శ్రీనివాస్ యాద‌వ్ తో క‌లిసి భూములు పంచుకునేందుకు మీటింగ్ పెట్టుకున్నార‌ని బాల‌య్య నేరుగానే విమ‌ర్శించారు. 

 

ఇక ఇదిలా ఉంటే బాల‌య్య ఈ నెల 10వ తేదీన త‌న పుట్టిన రోజు జ‌రుపు కుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టాలీవుడ్ పెద్ద‌లు జ‌గ‌న్‌ను కలిసేందుకు వెళుతోన్న స‌మావేశానికి కూడా వెళ్ల‌డం లేదు. త‌న పుట్టిన .రోజు సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ప‌లు అంశాల‌ను వెల్ల‌డించారు. త‌న‌కు చిన్నపటి నుంచి సినిమాలంటేనే ఇష్టం. చదువుపై శ్రద్ధ లేదు. ఇంటర్ తర్వాత  నాన్న చెప్పారని మెడికల్ ఎంట్రన్స్‌కు అప్లై చేశా. నాకు హాల్ టికెట్ రాదు అనుకున్నా. కానీ హాల్ టికెట్ వచ్చిందని.. అయితే  ఏ మాత్రం పుస్త‌కం తీయ‌కుండా వెళ్లి ప‌రీక్ష రాశాన‌ని.. త‌న‌కు ఖ‌చ్చితంగా సీటు రాద‌ని అనుకున్నాన‌ని అలాగే జ‌రిగింద‌ని బాల‌య్య చెప్పాడు.

 

ఇక సినిమాలో చేస్తూనే మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ ఇచ్చి బీఏ చ‌దివాన‌ని.. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. నేను చేసిన 100 సినిమాలు పెద్ద లెక్క కాదు. సినిమాల జయాపజయాలు మామూలే. కొన్ని సినిమాలు హిట్ అవుతాయకున్నవి ఫ్లాప్ అయ్యాయి. ఆడవు అనుకున్న సినిమాలు హిట్ అయ్యాయ‌ని బాల‌య్య చెప్పాడు. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో బాల‌య్య ప‌లు రాజ‌కీయ అంశాల గురించి సైతం మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: