బుల్లితెర‌పై త‌న చ‌లాకీత‌నంతో న‌వ్వులు పూయించే యాంక‌ర్‌ సుమ‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌ను ఎంటైర్‌టైన్ చేస్తున్నారు. కామెడీ వీడియోలు చేస్తూ హాస్యాన్ని పండిస్తున్న విష‌యం తెలిసిందే. సుమ..ఎప్పుడూ టీవీ షోలు, ఆడియో, ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ల‌తో బిజీగా ఉండే ఈ స్టార్ కు..తాజా లాక్ డౌన్ తో ఊహించ‌నంత టైమ్ స్పైస్ దొరికింది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టీవ్ గా ఉంటోంది.  త‌నకు తెలిసిన హెల్త్ టిప్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో కూడా తోటి యాంకర్స్ అందరితో కలిసి ఎంట‌ర్టైన్మెంట్ ప్రొగ్రామ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. 

 

అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఆమెను సుమ‌క్క అంటూ పిలుచుకోవ‌డం తెలిసిందే. తాజాగా సుమ రాములో రాములో పాట‌కు డ్యాన్స్ చేసిన వీడియోను త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్గా మారింది. ఈ పాట‌కు సుమ వేసిన స్టెప్పులు చూసిన అభిమానులు ఆమెను మెచ్చుకుంటూనే క‌డుపుబ్బా న‌వ్వుతున్నారు. అనేక‌మంది సుమ‌క్క‌కు త‌మ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌జేస్తున్నారు. సుమ‌క్క నీకు నువ్వే సాటి అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాములా’ సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. 

 


ఇప్పుడు యూట్యూబ్‌ను ఈ పాట షేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ప్ర‌ముఖ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌న భార్య‌తో క‌ల‌సి స్టెప్పులు వేయ‌డంతో ఈ పాట‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా అభిమానులు పెర‌గ‌డం విశేషం. ఇక బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ తార‌లు కూడా ఈ పాట‌కు ఫిదా అయిపోయారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఇప్ప‌టికీ కూడా ఈ సాంగ్ ట్రెండింగ్ కొన‌సాగుతుండ‌టం విశేషం. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల‌వైకుంఠ‌పురం సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రీ బ‌న్నీ..మాట‌ల మాంత్రికుడి కాంబోలో మ‌రో సినిమా వ‌స్తుందో రాదో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: