ఇండియన్ క్రికెట్ టీం మాజీ ఆటగాడు ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. సౌత్ ఇండస్ట్రీ లో తమిళ సినిమా రంగంలో జాన్‌‌ పాల్‌‌ రాజ్‌‌, శ్యామ్‌‌ సూర్యల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'ఫ్రెండ్ షిప్' టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేం లోస్లియా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.

IHG's 'Friendship' | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> ...

సినిమాని జేపీఆర్‌‌, స్టాలిన్‌‌లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిలీజ్ అయిన పోస్టర్ లో బ్యాగ్రౌండ్​లో లైబ్రరీ హాల్​ను చూపిస్తూ హర్భజన్, అర్జున్​లతో పాటు లోస్లియా లుక్ కూడా రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఇక ఈ సినిమాని హర్భజన్ సింగ్ కి ఉన్న క్రేజ్ నేపధ్యంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

IHG

సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రిలీజ్ కాబోతుంది. క్రికెటర్ గా తన బౌలింగ్ తో ఎన్నో వికెట్లు సాధించిన హర్భజన్‌‌ సింగ్‌ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటువంటి తరుణంలో హీరోగా సినిమా రాబోతున్న తరుణంలో క్రికెట్ ప్రేమికులకు మరియు సినిమా ప్రేమికులకు ఈ సినిమా పండగే అని చెప్పవచ్చు. మరి గ్రౌండ్ లో అనేక వికెట్లు పడగొట్టిన హర్భజన్ సింగ్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: