తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్ అనే మాట ఉంటుంది. హీరో, దర్శకుడు, సినిమా.. ఇలా ఎవరు ఏ విభాగాల్లో కొత్తదనం సృష్టిస్తే వారిని ట్రెండ్ సెట్టర్ అంటూ ఉంటారు. ఈ ట్రెండ్ సెట్టర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ. ‘శివ’ సినిమాతో తెలుగులోనే కాదు.. భారతదేశ సినిమా మేకింగ్ నే మార్చేశాడు. తన క్రియేటివిటీతో కెరీర్లో ఎన్నో వండర్స్ చేసిన వర్మ ప్రస్తుతం ఆ ట్రాక్ పూర్తిగా తప్పాడు. రీసెంట్ గా వర్మ తెరకెక్కించిన ‘క్లైమాక్స్’కు వస్తున్న రివ్యూలే ఇందుకు ఉదాహరణ.

IHG's What The Viewers Have To Say About ...

 

వర్మ తన 31ఏళ్ల లాంగ్ కెరీర్లో ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు. హీరో, హీరోయిన్, విలన్ తోనే సినిమాను నడిపించి.. రెండే డ్రెస్సులు మార్చి.. హీరోయిన్ తప్పితే మరో లేడీ క్యారెక్టర్ లేకుండా తీసిన ‘క్షణక్షణం’ ఓ అద్భుతం. ఇద్దరు ప్రేమికులు లేచిపోయి పెళ్లి చేసుకోవడం అనే సాధారణమైన కాన్సెప్ట్ ను ‘అనగనగా ఒక రోజు’గా తీసి తన క్రియేటివిటీతో బ్లాక్ బస్టర్ చేశాడు. సాధారణ అమ్మాయి హీరోయిన్ అయపోవడాన్ని ‘రంగీలా’గా తీసి ఇండియన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశాడు. ఏ దర్శకుడైనా టచ్ చేయడానికే భయపడే ‘మాఫియా’ బ్యాక్ డ్రాప్ ను వర్మ ఆడుకున్నాడు. సత్య, కంపెనీ, డి.. వంటి సినమాలతో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

IHG

 

ఇలాంటి వర్మ కొన్నేళ్లుగా తన మార్క్ ఏమాత్రం చూపించలేకపోతున్నాడు. ఇందుకు మరో ఉదాహరణగా పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ నిలిచిందని అంటున్నారు. గతంలో.. ‘ఈ సినిమాలో వర్మ ఏదో మ్యాజిక్ చేస్తాడు’ అని సగటు ప్రేక్షకుడు ఆశించేవాడు. ప్రస్తుతం వర్మ సినిమా తీస్తున్నాడంటే ఫ్లాప్ అని ముందే ఫిక్సయిపోతున్నారు. అయినా.. వర్మ మరో సినిమా అనౌన్స్ చేస్తే క్రేజ్ వచ్చేయడం ఖాయం. దటీజ్ ‘ఆర్జీవీ’.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: