తెలుగు సినీ సీమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. మరెంతో మంది లెజెండ్స్ ఉన్నారు. వారందరూ తనకంటూ సొంత పేజీలు రాసుకున్నారు. చరిత్ర తిరగేస్తే వారి తీపి గురుతులు ఎన్నో కనిపిస్తాయి. ఇదిలా ఉండగా తెలుగు తెర మీద స్టార్లుగా, సూపర్ స్టార్లుగా అరవై ఏళ్ళ వరకూ నటించిన హీరోలు ఎంతో మంది ఉన్నారు.

 

వారిలో తొలితరంలో ఎన్టీయార్, ఏయన్నార్లను తీసుకోవాలి. ఇక తరువాత తరంలో చూసుకుంటే చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు హీరోలుగానే హిట్లు కొడుతూ అరవైలోకి ప్రవేశిస్తున్నారు. 

 

ఇక ఎన్టీయార్ విషయం తీసుకుంటే ఆయన అరవయ్యేళ్ళ వయసు రాగానే రాజకీయల్లోకి వచ్చేశారు. ఆయన  ఆ ఏజ్ లో జనంలోనే ఉంటూ తెలుగుదేశం ప్రచారం కోసమే తిరిగారు. నాగేశ్వరరావు అరవయ్యేళ్ల నాటికి హీరోగా కొంత తగ్గినా ఆయన కూడా షష్టి పూర్తి వేడుకలు మరీ ఘనంగా జరుపుకోలేదు.

 


అయితే ఇందులో షష్టిపూర్తి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్న ఘనత మాత్రం అచ్చంగా మెగాస్టార్ కి దక్కిందనే చెప్పాలి.  అయిదేళ్ళ క్రితం మెగాస్టార్ 60 ఏళ్ల వేడుకలను కుటుంబ సభ్యులతో పాటు, తెలుగు సినిమా పెద్దలు, ఇతర భాషల ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. 

 


ఇపుడు మళ్ళీ చూస్తే బాలక్రిష్ణ అరవయ్యేళ్ళ వేడుకను జరుపుకుంటున్నారు. నిజానికి లాక్ డౌన్ లేకపోతే ఘనంగానే బాలయ్య ఏర్పాట్లు చేసేవారు. కానీ ఆ సరదాను బాగా తగ్గించింది లాక్ డౌన్ అనుకోవాలి. సరే బాలయ్య వరకూ చూసుకుంటే షష్టి పూర్తిని సంబరంగా జరుపుకుంటున్నారు. కానీ బాలయ్య కంటే ఏడాది పెద్ద అయిన అక్కినేని నాగార్జున గత ఏడాది విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్యనే తన షష్టి పూర్తి సింపుల్ గా జరిపేసుకున్నారు.

 

ఇక ఈ ఈ ఏడాది డిసెంబర్ 13 నాటికి 60 ఏళ్ళు నిండి వెంకటేష్ కూడా షష్టి పూర్తి పెళ్ళి కొడుకు అవుతారు. మరి ఆయన ఎలా చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా హీరోలకు వయసు బెంగ వల్ల అరవై ఏళ్ళ పండుగకు చాలా మంది దూరంగా ఉంటారు. కొద్ది మంది మాత్రమే దాన్ని కూడా ఈవెంట్ చేస్తారు. అలాంటి వారిలో చిరంజీవి ముందుంటే, బాలయ్య కూడా సై అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: