మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్న్ లో సినిమా ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో  ఆచార్య సినిమా చేస్తున్న చిరు తన నెక్స్ట్ సినిమా సుజిత్, మెహెర్ రమేష్, కె.ఎస్ బాబీ డైరక్షన్ లో ఉంటాడని అంటున్నారు. అయితే ఈ ముగ్గురు కన్నా ముందు మాటల  డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. ఇప్పటికే త్రివిక్రమ్ చిరు కోసం కథ ఫైనల్ చేశాయట. టైం చూసుకుని చిరుకి కథ వినిపించే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. 

 

మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా అంటే ఆ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.  పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. తారక్ తో అరవింద సమేత సినిమా తర్వాత మరో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ సినిమా పూర్తి అయ్యాక చిరు సినిమా లైన్ లో పెడతాడట. ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ మార్క్ పంచులతో మెగాస్టార్ చేసే  అదిరిపోతోందని టాక్. 

 

మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త కాంబో సినిమా రుచి చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమా ఎవరు నిర్మిస్తారు..? సినిమా ఎప్పుడు మొదలవుతుంది..? సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.  ఎన్టీఆర్ తర్వాత చిరు సినిమా.. అదిరిపోయే కాంబినేషన్ కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాపై సూపర్ ఎక్సయిటెడ్ గా ఉన్నారు. ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: