టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మంచి స్నేహితులు అని అందరికీ తెలుసు. 'జల్సా' సినిమా తో మొదలైన వీరిద్దరి ప్రయాణం సినిమాల కతీతంగా వ్యక్తిగతంగా బయట స్నేహితులయ్యారు. ఒకే రకమైన భావాలు మరియు త్రివిక్రమ్ యొక్క ఆలోచనలు పవన్ కి నచ్చడంతో చాలా వరకు పవన్ విషయాలలో త్రివిక్రమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటారు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రావడం జరిగింది. అంతేకాకుండా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పవన్ నటించిన 'తీన్ మార్' సినిమా స్క్రిప్ట్ అప్పట్లో త్రివిక్రమ్ రాయటం జరిగింది. అదే విధంగా గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు కూడా కొంతమేర రచనా సహకారం త్రివిక్రమ్ అందించాడు.

IHG': S Thaman says composing <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUSIC' target='_blank' title='music-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>music</a> for the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> Kalyan ...

కాగా మొన్నటి వరకు రాజకీయాలలో బిజీగా ఉండి పవన్ కళ్యాణ్ చాలా కాలం గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీలోకి ‘వకీల్ సాబ్’ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఈ సినిమాలో త్రివిక్రమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తాజాగా బయటపడింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇవ్వటం జరిగింది.

IHG

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అస‌లు ప‌వ‌న్‌తో 'వ‌కీల్ సాబ్' సినిమా తీస్తాన‌ని అనుకోలేద‌ని.. తాను వేరే సినిమా స‌న్నాహాల్లో ఉండ‌గా నిర్మాత దిల్ రాజుతో క‌లిసి ఒక‌సారి త్రివిక్ర‌మ్‌ను క‌లిశాన‌ని.. అప్పుడు వాళ్లిద్ద‌రూ 'పింక్' రీమేక్ గురించి మాట్లాడుకున్నార‌ని.. అప్పుడు ఈ సినిమా అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందా అనుకున్నానని.. అనుకోకుండా ఆ అదృష్టం త‌న‌కే ద‌క్కింద‌ని వేణు తెలిపాడు. కాగా ఈ సినిమాకి మొదట త్రివిక్రమ్ మాటల రాయాల్సి ఉండగా అప్పట్లో బన్నీ సినిమా విషయంలో బిజీగా ఉండటంతో కుదరలేదని వేణు తెలిపాడు. మొత్తం మీద పవన్ రీఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' లో త్రివిక్రమ్ ఇన్వాల్వెమెంట్ ఉండటంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: