కొన్ని సినిమాలు సూపర్ హిట్లు.. మరికొన్ని సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి. కేవలం కొన్ని సినిమాలే ప్రేక్షకుల మనసుల్లో శాస్వతంగా నిలిచిపోయి క్లాసిక్స్ గా మిగిలిపోతాయి. తెలుగు సినిమా చరిత్రలో అటువంటి అరుదైన క్లాసిక్ గా ‘గుండమ్మ కథ’. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి, జమున, సూర్యాకాంతం, రమణారెడ్డి, అల్లు, రాజనాల.. వంటి హేమాహేమీలు ఎందరో నటించిన ఈ సినిమా ఓ అద్భుత కావ్యం. సున్నితమైన హాస్యంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమా విడుదలై నేటితో 58 ఏళ్లు పూర్తయ్యాయి. 1962 జూన్ 7న ఈ సినిమా విడుదలైంది.

IHG

 

సినిమాలో ప్రతిఒక్కరి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి చేసుకునే ముందు ఇద్దరు కుర్రాళ్లు ముందుగానే అత్తగారిళ్లలో అడుగుపెట్టి అక్కడి పరిస్థితులను చక్కదిద్దే పాత్రల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించారు. వీరిద్దరికీ జోడీగా సావిత్రి, జమున నటించారు. ఉదాత్తమైన పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. సినిమాకు అత్యంత కీలకమైన గుండమ్మ పాత్రలో సూర్యాకాంతం నటించారు. సినిమా కథ అంతా గుండమ్మ చుట్టూనే తిరుగుతుంది. ఇందుకు సహకరించే పాత్రలో రమణారెడ్డి నటించారు. గయ్యాళి, హాస్యం మిళితమైన పాత్రలో సూర్యకాంతం జీవించారు. గుండమ్మ పాత్రలో సూర్యకాంతంను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం.

IHG

 

నాగిరెడ్డి, చక్రపాణి తమ విజయా బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను కె.కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. ఘంటసాల సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్నీ వీనులవిందుగా ఉంటాయి. ఇన్నేళ్లలో ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి కానీ.. గుండమ్మ కథను మాత్రం రీమేక్ చేయలేకపోయారు.  కారణం.. గుండమ్మ పాత్ర. ఆ పాత్రను సూర్యకాంతంలా చేయగల నటి ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పటికీ దొరకలేదంటే ఆ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశమెంతో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు సినిమాల్లో అద్భుతం ‘గుండమ్మకథ’. అప్పట్లో 17 సెంటర్లలో 100 రోజులు, విజయవాడలో 175 రోజులు రన్ అయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: