పుష్ప సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ జనాలు ఎక్కువగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిందో ఇక అక్కడి నుంచి కూడా ఈ సినిమా గురించి టాలీవుడ్ లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు కథ ఏ విధంగా ఉంటుంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బన్నీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి జనాలకు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ ఎప్పుడు చేయని విధంగా రిస్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది తీసుకొస్తారు ప్రేక్షకుల ముందుకి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా విషయంలో నిర్మాతకు అండగా ఉండాలి అని బన్నీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమీ లేదు లాక్ డౌన్ కారణంగా ముందు అడ్వాన్స్ ఇచ్చి నిర్మాత బాగా ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం. ఇప్పుడు ఆ అడ్వాన్స్ ని తిరిగి వెనక్కు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాడట. సినిమా మొదలైన తర్వాత తీసుకుంటా అని చెప్పాడట బన్నీ. దానికి నిర్మాత కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక సుకుమార్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా పెట్టుబడి పెట్టడం ఇబ్బంది అని ఎప్పుడు సినిమాలు మొదలవుతాయి అనేది చెప్పడం చాలా కష్టం అని భావిస్తున్నారట. 

 

అందుకే తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారట. సుకుమార్ కూడా బన్నీ నిర్ణయాన్ని కాదు అనలేదు అని తనకు నిర్మాత కష్టాలు తెలుసు కాబట్టి వెనక్కు ఇచ్చారు అని అంటున్నారు. కాగా ఈ సినిమాలో బన్నీ పాత్ర మీద ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: