ప్రేమమ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ఎట్టకేలకు ఓ భారీ ఆఫర్ పట్టేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించనున్న 65వ చిత్రంలో మడోన్నా కీలక పాత్రలో కనిపించనుందట అయితే ఈవిషయంలో అధికారకంగా ప్రకటన రావాల్సిఉంది.
 
ఇక ప్రేమమ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన మడోన్నా ఆ తరువాత పలు మలయాళ ,తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా తెలుగులో  ప్రేమమ్ రీమేక్ తో ఎంట్రీ  ఇచ్చిన మడోన్నా ఈసినిమా తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇదిలావుంటే విజయ్ 65వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్  మురగదాస్ డైరెక్ట్ చేయనుండగా థమన్ సంగీతం అందించనున్నాడు. ఈచిత్రం బ్లాక్ బాస్టర్ మూవీ తుపాకికి సీక్వెల్ గా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించనుంది. 
 
ఇక  విజయ్ ఈ సినిమా కన్నా ముందు మాస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎప్పుడో విడుదలకావాల్సిన ఈచిత్రం కరోనా వల్ల వాయిదా పడింది దాంతో దీపావళికి విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. విజయ్ పుట్టిన రోజు జూన్ 22న మాస్టర్ ట్రైలర్ ను విడుదలచేయనున్నారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించగా ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆడియో సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మాస్టర్ తెలుగులో కూడా విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: