నందమూరి బాలకృష్ణ ని యమా దూకుడుగా చూపించిన సినిమా పైసా వసూల్. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్య అంతక ముందెన్నడు చేయని పాత్ర చేసి అదరగొట్టాడు. పూరి సినిమా అంటే చాలు ప్రతీ హీరోకి ఎనర్జీ టన్నుల కొద్ది వస్తుంది. అదే ఎనర్జీ బాలయ్యకి వచ్చింది. కనీసం కథ కూడా వినకుండా "నేను నీ సినిమాలు చూశాను మనం డైరెక్ట్ గా షూటింగ్ కి వెళ్ళి పోదాం" అన్న మాట తో పైసా వసూల్ మొదలైంది. 

 

అయితే పూరి బాలయ్య కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీలో రక రకాల వార్తలు వినిపించాయి. ఈ కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవుతుందా అన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమయ్యాయి. అయిన పూరి బాలయ్య ..ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకంతో సినిమా పూర్తి చేశారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పూరి కి మాత్రం ఇండస్ట్రీ వాళ్ళ నుండి అలాగే నందమూరి ఫ్యాన్స్ నుండి ప్రశంసల జల్లు కురిసింది. అసలు బాలయ్యని అంత ఎనర్జీతో చూపిస్తాడని ఏ ఒక్కరు ఊహించలేదు.

 

ఇదే సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమా విషయంలో చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే అంతక ముందు చాలా సార్లు చాలామంది బాలయ్య తో పాట పాడించాలని ప్రయత్నించి ఫేయిల్ అయ్యారు. కాని బాలయ్య తో పాట పాడించి పూరి సక్సస్ అయ్యాడు. ఇక ఈ సినిమాతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. వాస్తవంగా పైసా వసూల్ తర్వాత మళ్ళీ వెంటనే పూరి బాలయ్య కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు.

 

కాని ఇద్దరు వేరే వేరే సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల కుదరలేదు. అయితే రీసెంట్ గా ఇద్దరు కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారన్న న్యూస్ వచ్చింది. పూరి బాలయ్య కోసం కథ రాసి బాలయ్యకి వినిపించగా అది బాలయ్యకి విపరీతంగా నచ్చి త్వరలో మొదలు పెడదామన్న మాట చెప్పారట. అయితే జూన్ 10 న బాలయ్య బర్త్ డే సందర్భంగా పూరి బాలయ్య కొత్త సినిమా న్యూస్ రాబోతుందని తాజా సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: