ఏదో ఒక కాంట్రవర్సీ లేకుండా.. విజయ్ సినిమా రిలీజ్ కాదు. ప్రతీసారి ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త సినిమా మాస్టర్ రిలీజ్ విషయంలోనూ.. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ రిలీజ్ ను ఆల్ రెడీ కరోనా అడ్డుకోగా.. ఓ నిర్మాత ప్రయత్నిస్తున్నాడు. 


కార్తీతో తీసిన ఖైదీతో హిట్ కొట్టిన లోకేశ్ కనకరాజ్ విజయ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ కాంబినేషన్ లో మాస్టర్ మూవీ రూపొందింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 9న రిలీజ్ కావాల్సిన మాస్టర్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మాస్టర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన వాతి కమ్మింగ్ సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తూ.. 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 


తమిళనాడు ప్రభుత్వం జూలై నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ ఓపెన్ చేయడం ఆలస్యం.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మొదటి చిత్రంగా మాస్టర్ ను విడుదల చేయాలని థియేటర్స్ యాజమాన్యం భావిస్తోంది. పెద్ద సినిమా రిలీజైతే.. థియేటర్స్ జనాలతో కళకళలాడి.. పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో ఎగ్జిబిటర్స్ ఉన్నారు. 


థియేటర్స్ తిరిగి ప్రారంభం కాగానే.. మాస్టర్ రిలీజ్ కు అనుమతి ఇవ్వొద్దని నిర్మాతల మండలి అధ్యక్షుడు కే ఆర్ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా మహమ్మారి చెన్నయ్ లో ఎక్కువగా ఉందని.. విజయ్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని.. దీనివల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ క్రమంలో హీరోకు ఉన్న మంచిపేరు పోతుందని లేఖలో పేర్కొన్నాడు కేఆర్. దీంతో మాస్టర్ రిలీజ్ పై.. డైలమా నెలకొంది. థియేటర్స్ ఓపెన్ అయినా.. మాస్టర్ ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: