ఎలాగైనా టాలెంట్ చూపించాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే.. సరైన అవకాశం వచ్చే దాకా వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది. అయితే మొదటి కేటగిరికి సంబందించిన వారికి సినిమా తీయాలంటే సింపుల్.  సినిమా సింపుల్ ఎలా అవుతుంది. బడ్జెట్, కాస్ట్ అండ్ క్రూ, ప్రొడక్షన్, లొకేషన్స్, సాంగ్స్, మ్యూజిక్ ఇవన్నీ ఉండాలి కదా అనుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి కానీ అవి ఉన్న పరిమితుల్లో ఉంచుతూ సూపర్ హిట్టు బొమ్మ తీయొచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు మారుతి. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారిన మారుతి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. 

 

అయితే మారుతి మొదటి సినిమా ఈరోజుల్లో. శ్రీ, రేష్మ జంటగా నటించిన ఈ సినిమా 2012లో రిలీజై ఓ ట్రెండ్ సృష్టించింది. అదేంటీ ట్రెండ్ సృష్టించాలంటే స్టార్స్ కావాలి.. భారీ బడ్జెట్ కావాలి కదా అనుకోవచ్చు. ఇవేమి లేకుండానే ఇలా కూడా సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేసి చూపించాడు మారుతి. గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్ లో ఈరోజుల్లో సినిమా చేసిన మారుతి ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ 50 లక్షల లోపే.. అయితే సినిమా తీయడం కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా తెలిసిన మారుతి ఈరోజుల్లో సినిమాను బాగా ప్రమోట్ చేశాడు. 

 

అప్పటి యూత్ ఆడియెన్స్ అందరు ఈ సినిమా చూడటానికి ఎగబడేలా ఈరోజుల్లో ప్రచార చిత్రాలు ఉండేవి. అంతేకాదు పబ్లిసిటీ అంటే ఇలా ఉండాలి అనిపించేలా.. బస్టాప్, అన్ని ఫెమస్ జంక్షన్స్ ఇలా ఎక్కడ వదలకుండా ప్రమోట్ చేశారు. అదే సినిమాను ఆడించాయని చెప్పాలి. థియేటర్ దాకా వచ్చిన ఆడియెన్స్ ను మెప్పించేలా చేసిన మారుతి ఈరోజుల్లో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 12 కోట్లు వసూళ్లు రాబట్టింది అంటే మారుతి టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: