శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ సినిమా అప్పటి యూత్ ఆడియెన్స్ ను.. టీనేజ్ ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. తన మార్క్ సహజమైన కథ, కథనాలతో ఆకట్టుకునే శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. కాలేజ్ లో నలుగురు స్నేహితులు.. వాళ్ళ పరిచయాలు.. ప్రాముఖ్యతలు.. ప్రేమలు.. అపార్ధాలు.. ద్వేషాలు.. మళ్ళీ తిరిగి కలిసే ప్రయత్నాలు ఇలా హ్యాపీడేస్ సినిమా చూస్తే అది సినిమాలా కాకుండా మన పక్కన జరిగే.. మన జీవితంలో జరిగే కథలా అనిపిస్తుంది. 

 

శేఖర్ కమ్ముల సినిమా తీసే టైంలో ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఎంత అంచనా వేశాడో కానీ ఆ అంచనాలను మించి ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించింది. అంతేకాదు సినిమా మొదటి షో కన్నా రోజులు గడిచే కొద్దీ కలక్షన్స్ బీభత్సం సృష్టించింది. దర్శక నిర్మాతగా శేఖర్ కమ్ముల ఆ సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మళ్ళీ తమ కాలేజ్ డేస్ గుర్తుచేసుకునేలా చేశారు. అంతేకాదు చదువు మధ్యలో ఆపేసిన వారికి కూడా కాలేజ్ ఇంత అందంగా.. అద్భుతంగ ఉంటుందా అనుకునేలా చేశాడు. 

 

సినిమా హిట్టు అవడం, కలక్షన్స్ రావడం కామనే కానీ ఒక సినిమా ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సినిమానే హ్యాపీడేస్. ఈ సినిమాను కూడా దర్శక నిర్మాత కాబట్టి 2,3 కోట్లకు మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మగా దాదాపు 15 కోట్ల దాకా రాబట్టింది తెలుస్తుంది. నిర్మాతగా తన కన్నా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాకు ఎక్కువ లాభ పడ్డారని చెప్పొచ్చు. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు.       

మరింత సమాచారం తెలుసుకోండి: